Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురు వ్యక్తులపై కేసు నమోదు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
దుమ్ముగూడెం పోలీసులు ఆదివారం భారీగా గంజాయి పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.84 లక్షల 30 వేల విలువ గల 421 కేజీల గంజాయిని స్వాదీన పర్చుకోవడంతో పాటు గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు సీఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... గత నెల జులై 31వ తేదీ సాయంత్రం రెండు గంటల సమయంలో ఎస్సై యం.రవికుమార్ పోలీస్, సిఆర్పిఎఫ్ సిబ్బందితో అంజుబాక క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఏపి 37 ఏకె 1359 అనే నెంబరు గల ఇనోవా వాహనంలో ఏపిలోని ఒడిస్సా సరిహద్దు నుండి భద్రాచలం మీదుగా హైదరాబాద్కు గంజాయిని తరలిస్తూ వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి పారి పోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకిని తనిఖీలు నిర్వహించగా ఇన్నోవా వాహనంలో ఆరు సంచులలో 200 ప్యాకెట్లు గల 421 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. వాహనంలో ఉన్న హైదరాబాద్కు చెందిర కారు డ్రైవర్ ఎండి అష్పాక్, మహమద్ ఇమ్రాన్, సయాద్ నావిద్, మహమద్ ఆవాయిజ్గా తెలిపారు. నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు.