Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్లబ్ నాల్గవ వార్షికోత్సవంలోడీజీఎం సతీష్
- నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా సుంకరి సురేందర్, సజ్జా సాహిత్య
నవతెలంగాణ-అశ్వాపురం
లయన్స్ క్లబ్ సేవలు సేవాదృక్పథం, అంకిత భావంతో కొనసాగాలని భారజల కర్మాగార డీజీఎం జి.సతీష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఓం శక్తి కల్యాణ మండపంలో నిర్వహించిన లయన్స్ క్లబ్ నాలుగవ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.
అనేక దేశాలలో విస్తరించి ఉన్న లయన్స్ క్లబ్ సేవలు అనునిత్యం అనేక రకాలుగా ప్రజలకు ఉపయోగపడేలా కొనసాగుతు న్నాయన్నారు. నేడు అశ్వాపురంలో ఏర్పాటైన క్లబ్ నాలుగేళ్ళు పూర్తిచేసుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు. లయన్స్ క్లబ్‌లోని సభ్యులందరూ మరిన్ని సేవాకార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందాలని ఆయన ఆశాబావం వ్యక్తంచేసారు.
లైన్స్ క్లబ్ నూతన కమిటి ఇదే :
మండల కేంద్రంలో నిర్వహించిన లయన్స్‌క్లబ్ వార్షికోత్సవ సభ అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా సుంకరి సుంరేందర్, కార్యదర్శిగా సజ్జా సాహిత్య, కోశాధికారిగా మంతెన రత్నాకర్, ఉపాధ్యక్షుడిలుగా కిలారు కొండలరావు, వర్రే వీరభద్రం, సంయుక్త కార్యదర్శులుగా గాదే కేశవరెడ్డి, భూక్య దేవెందర్, కడితి నర్సింహులు, పాయం సర్వేశ్వరరావులను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో తహశీల్దార్ వి.సురేష్ కుమార్, సీఐ సట్ల రాజు, పి.గోపాల్‌రెడ్డి, కాపా మురళికృష్ణ, సీఎచ్.శివప్రసాద్, నరేష్ పాల్గొన్నారు.