Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తల్లడిల్లిన వృద్ధురాలు
- ఎస్సై చొరవతో క్షేమంగా బయటపడ్డ మాతృమూర్తి
నవతెలంగాణ-చర్ల
చర్ల వారపు సంతకు వచ్చి తిరుగుప్రయాణంలో వెళుతున్న బత్తినపల్లికి చెందిన ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన సంఘటన దేవనగరం మూలమలుపు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. ట్రాక్టర్ డ్రైవర్ అతి వేగమే కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ట్రాక్టర్లో సిమెంట్ రేకుల లోడు చేసుకొని రేకులపై పలువురిని కూర్చుండబెట్టి అతి వేగంగా వెళ్తున్న క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీ కొట్టడం వలన రేకులపై కూర్చున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి
తల్లడిల్లిన వృద్ధురాలు
ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న దేవి అనే వృద్ధురాలి కుడికాలు రేకులు కింద ఉండడం వలన సుమారు గంటపాటు వృద్ధురాలు తల్లడిల్లిపోయింది. ఆమెను రక్షించేందుకు పలువురు యువకులు, స్థానికులు శతవిధాల ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో మాతృమూర్తి శోక సముద్రంలో మునిగింది. చూసే వారికి సైతం కన్నీటి పర్వతం కాక తప్పలేదు. సు మారు 80 సంవత్సరాలు ఉన్న ఆదివాసి వృద్ధురాలు తనని తాను రక్షించు కోవడానికి విశ్వ ప్రయత్నం చేసింది
ఎస్సై వెంకటప్పయ్య చొరవతో క్షేమంగా బయటపడిన మాతృమూర్తి
అతి వేగంగా వెళ్లి బోల్తా పడిన ట్రాక్టర్, రేకుల కింద పడి ఉన్న వృద్ధురాలిని రక్షించడానికి చర్ల ఎస్ఐ వెంకటప్పయ్య విశ్వ ప్రయత్నం చేసి యుద్ధప్రా తిపదికన జేసీబీ సహాయంతో మాతృమూర్తిని కాపాడారు. ఆమెను క్షేమంగా బయటకు తీసి హుటాహుటిన వైద్యం కోసం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమయానికి సంఘటన స్థలానికి చేరుకొని సమయస్ఫూర్తితో వృద్ధురాలిని కాపాడిన ఎస్ఐ వెంకటప్పయ్యను పలువురు అభినందించారు. సమయానికి జేసీబీ పంపిన అల్లూరు మురళికి పలువురు అభినందనలు తెలిపారు.