Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు
- 50 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ
నవతెలంగాణ-పాల్వంచ
కరోనా విజృంభిస్తున్నా ప్రజలను పట్టించుకోని పాలకులు కార్పొరేట్ శక్తులకు దాసోహం అవుతూ పేదలపై భారాలు మోపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై సమరశీల ఉద్యమాలు నిర్వహిస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు స్థానిక అల్లూరి సెంటర్ సీపీఐ(ఎం) కార్యాలయంలో అమరజీవి కామ్రేడ్ బరపటి సీతారాములు కోవిడ్ సహాయ కేంద్రం ద్వారా దాతల సహకారంతో కరోనాతో ఇబ్బంది పడుతున్న పేదలకు సుమారు రూ.2 వేల విలువ గల నిత్యావసర సరుకులు 50 కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలు అంటిపెట్టుకొని ఉన్న ఏకైక పార్టీ సీపీఐ(ఎం) అని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పేద ప్రజలకు ఉచితంగా ప్రతి నెల 50 కేజీల బియ్యం, రూ7500 ప్రతి కుటుంబానికి పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, పట్టణ కార్యదర్శి దొడ్డా.రవికుమార్ మాట్లాడారు. నిత్యావసర సరుకుల పంపిణీకి సహకరించిన దాతలకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు ఎం.జ్యోతి మాట్లాడుతూ కరోనా కాలంలో ప్రజలకు రూ.రెండు లక్షల విలువ గల కూరగాయలు పంపిణీ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కమిటీ సభ్యులు గుడిపురి రాజు, మెరుగు ముత్తయ్య, సత్య, వి.వాణి, రహీం, రాములు, మంచికంటి నగర్ శాఖ కార్యదర్శి రాములు తదితరులు పాల్గొన్నారు.