Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటికీ పైసా ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం
- ఏడేండ్లుగా అమలుకు నోచుకోని సీఎం కేసీఆర్ హామీ
నవతెలంగాణ-భద్రాచలం
రాష్ట్ర, జిల్లాల విభజనలో భద్రాచలం నియోజకవర్గం సమూలంగా నష్టపోయింది. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి జరగని అన్యాయం ఈ ప్రభుత్వాలు ఈ భద్రాచలానికి చేశాయి. ఈ నియోజకవర్గం ఇప్పుడు మూడు ముక్కలైంది. ఒక రకంగా చెప్పాలంటే భద్రాచలం ప్రాంతం అభివృద్ధిలో జీవచ్ఛవంగా మారింది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపాలు వెళ్ళాయి. గత ఏడేళ్ల క్రితం శ్రీరామనవమికి భద్రాచలం వచ్చినా సీఎం కే.చంద్రశేఖ రరావు భద్రాచల అభివృద్ధి కోసం రూ.వంద కోట్లు ప్రకటించారు. మళ్లీ శ్రీరామ ముఖ్యమంత్రి వస్తారు. నిధులు తేస్తారని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా గతంలో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాలకు సీఎం కేసీఆర్ రాలేదు. దీంతో రూ.వంద కోట్ల అభివృద్ధిపై నీలి నీడలు కమ్ముకున్నాయి.భద్రాచలం పట్టణం కేవలం రెండు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి పరిమితమైంది. భద్రాచలం పట్టణంలో వచ్చే చెత్తాచెదారం పడివేయడానికి కూడా ఖాళీ స్థలం లేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ రూ.వంద కోట్లతో ఏ ఏ పనులు చేపడుబోతున్నారో ? అధికారుల వద్ద స్పష్టతలేదు. ఏ పనులు చేయాలన్నా భూమి కావాలి. స్థలాల సేకరణకు ప్రభుత్వం ఏమి చేయబోతోందో ఇప్పటికీ తేల్చుకోలేని పరిస్థితి. రామాలయంతో పాటు పట్టణంలో రోడ్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తారని అందరూ భావించారు.
సీఎం కేసీఆర్ హామీకి ఏడేళ్లు ?
భద్రాచల రామాలయ అభివృద్ధి కోసం రూ.వంద కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ హామీకి ఏడేండ్లు పూర్తయ్యాయి. అలాగే 2017లో రాష్ట్ర అసెంబ్లీలో ఈ వంద కోట్ల నిధులు మంజూరుకు ఆమోదం తెలిపారు. అయితే ఆచరణకు నోచుకోలేదు. అదే విధంగా నిధులు కేటాయిస్తున్నట్లు కూడా ప్రకటించటం గమనార్హం. స్వయంగా సీఎం కేసీఆర్ భద్రాచలం శ్రీరామనవమికు వచ్చి రామయ్య కళ్యాణం అనంతరం భద్రాచల అభివృద్ధికి రూ.వంద కోట్లు ప్రకటిం చిన హామీ ఆచరణలోకి నోచుకోక పోవడంపై సర్వత్రా విమర్శలు వెలువడు తున్నాయి. ఈ సమయంలో భద్రాచలం పక్కనే ఉన్నా పురుషోత్త పట్నంలో రామాలయానికి సుమా రు 900 ఎకరాల భూమి ఉంది. ఈ భూములు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వున్నాయి. ఇక్కడ నిర్మాణం చేపట్టాలంటే కొన్ని అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. భద్రా చలంలో రామాలయం అభివృద్ధితో పాటు సత్రాలు, కాటేజీల నిర్మాణం, పట్టణంలో రోడ్లు, డ్రైనేజీనీతో పాటు ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. గోదావరి నదిపై రెండవ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. త్వరలోనే అది పూర్తి కావచ్చే అవకాశాలు ఉన్నాయి. భద్రాచలం పట్టణానికి వల యంగా కరకట్టను ఏర్పాటు చేశారు. ఈ కరకట్టలో సుంద రంగా అలంకరిస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గతంలోనే పురుషోత్త పట్నంలో ''రామాయణం ధీం పార్క్ '' ప్రారంభించారు. ఆ పనులు మధ్యలోనే నిలిచి పోయాయి. భద్రాచలం పట్టణాన్ని ఆధ్యాత్మికంగా పర్యాట కంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.