Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్
నవతెలంగాణ-కారేపల్లి
నియోజవర్గ నిధులను ప్రాధాన్యత పనులను కేటాయించటం జరుగుతుందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. ఆదివారం కారేపల్లి మండలంలో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. ఈసందర్బంగా కారేపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే నియోజవర్గ నిధులను అన్ని మండలాలలకు సమప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధికి పాటుపడతానన్నారు. డోర్నకల్ - కారేపల్లి - ఇల్లందు బీటీ పనులు అసంపూర్తిగా నిలిచిపోయి ఇబ్బందుల విషయమై స్పందించారు. పెండింగ్లో ఉన్న అన్ని పనులను పూర్తి అయ్యేలా అధికారులతో సమీక్షించారు. మాదారం - ఖమ్మం నడిచే ఆర్టీసీ సర్వీసులను పునరుద్దరణ చేయించామన్నారు. వైరా నియోజవర్గంలోని అన్ని మండలాల్లో టీఆర్ఎస్ నూతన అధ్యక్షులను ప్రకటించామని త్వరలో పూర్తి కమిటీని ప్రకటిస్తామన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ అధ్యక్షులు తోటకూరి రాంబాబు, సంత ఆలయ చైర్మన్ మల్లెల నాగేశ్వరరావు, మండల కోఆప్షన్ ఎండీ.హనీఫ్, సోసైటీ డైరక్టర్ అడ్డగోడ ఐలయ్య నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, మజీద్ పాషా పాల్గొన్నారు.