Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీస్ కమిషనర్
నవతెలంగాణ-ఖమ్మం
అనాథల్లా భిక్షాటన చేస్తూ పరిశ్రమల్లో, వెట్టి చాకిరీలో మగ్గుతున్న 189 మంది చిన్నారులను గుర్తించి పునరావాస కేంద్రాలకు, తల్లిదండ్రుల చెంతకు చేర్చినట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. బాలలకు మంచి భవిష్యత్తు అందించడమే ఆపరేషన్ ముస్కాన్ -7 ముఖ్య ఉద్దేశమని, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేక నిర్లక్ష్యానికి గురైన వారు నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లలకు అధికారులు ఆశ్రయం కల్పించి భరోసా కల్పించారని తెలిపారు. అదేవిధంగా పిల్లలను వివిధ పనులకు ఉపయోగిస్తున్న 58 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జులై 1వ తేది నుండి 31 వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ లక్ష్యాన్ని విజయవంతంగా అమలు చేశారని అన్నారు. ఈ ఆపరేషన్ ముస్కాన్ లో నోడల్ ఆఫిసర్ డీసీపీ ఇంజరాపు పూజ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కార్మిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, షీ టీమ్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్, పోలీస్ అధికారులను సిఐ గోపీ, సీఐ నవీన్, డిసిపివో టి. విష్ణు వందన, ఎన్సీఎల్పీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సాయి సి డబ్ల్యూ సి లక్ష్మయ్య ఇతర అధికారులను పోలీస్ కమిషనర్ అభినందించారు.