Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్వాహణ లోపంతో ఎండిపోతున్న మొక్కలు
- దారిలేక... పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-కొత్తగూడెం
పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటుచేసి ప్రజలకు, ప్రకృతి ప్రేమికులకు ఆహ్లదాని పంచాలని తెలంగాణ ప్రభుత్వం యోచించింది. కానీ క్షేత్రస్థాయిలో ప్రజా ప్రతినిధులు, అధికారులు దానికి భిన్నంగా వ్యవహ రిస్తున్నారని తెలుస్తుంది. ఇందుకు నిదర్శనంగా కొన్ని పంచాయతీలు కనిపిస్తున్నాయి. లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం మారుమూలకు ఏర్పాటు చేశారు. దానికి గురించి సక్రమంగా పట్టించుకోక పోవడంతో ప్రకృతి ప్రేమికుల కోసం నిర్మించిన పల్లె ప్రకృతి వనం అద్వానంగా తయా రైంది. ఒక్క మాటలో చెప్పాటంలే ఈ వనం ఎక్కడ ఉందో పంచాయతీ ప్రజలకే తెలియదంటే అతి శయోక్తికాదు.
గత ఎండాకాలంలో మొక్కలు ఎండి పోయి దర్శన మిచ్చాయి. ప్రస్తుం హరిత హారం, ఎవిన్యూ ప్లాంటేషన్ కార్యక్రమం జరుగుతున్న తరుణంలో ప్రకృతి వనం పంచాయతీలో ఎక్కడ ఉందో తెలుసుకు నేందుకు ప్రజలకు ఆసక్తి పెరిగింది. ఇప్పటికైనా అధికారులు ప్రకృతి వనాన్ని వెతికి పట్టుక్కుని....లక్షల రూపాయలు పెట్టి నిర్మించిన ఉద్దేశాన్ని ప్రకృతి ప్రేమికులకు అందేలా చేయాలని పంచాయతీ ప్రజలు కోరుతున్నారు.