Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లబోదిబోమంటున్న రైతులు
నవతెలంగాణ-ముదిగొండ
ముదిగొండ మండలం నుంచి వెళుతున్న జాతీయ రహదారికి ఆ రహదారికి సరిపోను భూమి రైతుల సాగు భూముల నుండి 10 గుంటల వరకు భూములను తీసుకున్న ప్రభుత్వం ఆ పది గుంటల భూమి వరకే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. అలా కాకుండా ''అన్నీ ఉండి అల్లుడు నోట్లో శని అన్నట్టు''గా ఉంది ప్రభుత్వ తీరు. మొత్తం సాగు భూమిని నిషేధిత జాబితాలో పెట్టడంతో ఇక్కడ రైతులు లబోదిబోమంటున్నారు. ఎన్నిసార్లు తహసీల్దార్ కలెక్టరేట్ కార్యాలయాల్లో కలిసి అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదుని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళితే మండల పరిధిలో గోకినేపల్లి వెంకటాపురం గ్రామాలకు చెందిన సుమారు పది మంది రైతులు జాతీయ రహదారికి కావలసిన భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు. ఒక సర్వేనెంబర్లో నాలుగు ఎకరాలు ఉన్న భూమిలో 10 గుంటలు భూమిని జాతీయ రహదారికి ఇచ్చిన రైతు ఆ పది కుంటలు పోను మిగతా భూమిని రైతు సాగు చేసుకోవాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. మొత్తం నాలుగు ఎకరాల భూమిని (నాల) ధరణిలో నిషేధిత జాబితాలోకి పెట్టి ప్రభుత్వం పలు ఇబ్బందులకు గురిచేస్తుందని రైతులు వాపోతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ధరణి యాప్లో పట్టా భూములు నాలలో పెట్టడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతుల సాగుభూములు నిషేధిత జాబితా నుండి (నాలా) తొలగించాలని రైతులు డిమాండ్ చేశారు. లేనియెడల ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని రైతుల హెచ్చరించారు.