Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళితులందరికీ ఏక కాలంలో దళిత బంధు పథకం అమలు చేయాలి
- కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు
నవతెలంగాణ - ఖమ్మంరూరల్
దళిత సాధికారత పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని రాష్ట్రంలోని దళితులు అందరికీ ఏకకాలంలో అమలుచేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు అన్నారు. మండలంలోని నాయుడుపేట గ్రామంలోని దళితవాడలో సోమవారం కెవిపిఎస్ మండల నాయకులు కస్థలా ఆంటోనీ అధ్యక్షతన దళితుల సమగ్రాభివృద్ధి-సాధికారత అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది.ఈ సదస్సులో స్కైలాబ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో దళితుల పాత్ర అమోఘమైనది అన్నారు.తెలంగాణ ఏర్పడితే మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా దళితుడే ఉంటాడని హామీ ఇచ్చి కేసీఆర్ మాట తప్పడన్నారు. దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు.దళితులకు 3 ఎకరాల భూమి, అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూము ఇళ్ళు ఇస్తానని మాట తప్పడన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో దళితుల ఓట్లు పొందేందుకె దళిత బంధు పథకానికి తెరలేపడని విమర్శించారు. ఈ సారి కూడా మాట తప్పితే దళితులందరం ఐక్యమై కెసిఆర్‌ను ప్రగతి భవన్ నుంచి తరిమి కొడతాం అన్నారు. జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్ మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను వారికే కేటాయించాలని డిమాండ్ చేశారు.దళితులకు ఎలాంటి షరతులు లేకుండా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ మండల కార్యదర్శి నందిగామ కృష్ణ, మండల నాయకులు పిడమర్తి వెంకన్న, సారయ్య,కొండ మధు, కొండ నాగ సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 13 మందితో కూడిన నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నందిగామ మధుసూదన్‌రావు, కార్యదర్శిగా నూకల నర్సింహారావులను ఎన్నుకున్నారు.