Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9న కలెక్టరేట్ ముట్టడి :వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 9న రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సేవ్ ఇండియా ఉద్యమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆ ప్రచారంలో భాగంగా సోమవారం మండలంలోని గుదిమళ్ళ, కాచిరాజుగుడెం, అరేంపుల, ఎం. వెంకటాయపాలెం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదల పొట్ట కొట్టి పెద్దలకు పంచడం సిగ్గు చేటన్నారు.ఉపాధి హామీకి బడ్జెట్లో నిధులు పెంచాలని, రోజుకు కనీస వేతనం 600 రూపాయల ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాదినేని రమేష్ నాయకులు పొన్నెకంటి సంగయ్య, పెరుమల్లపల్లి మోహన్రావు, పొన్నం వెంకటరమణ, జింక బాలరాజు, మేడికొండ నాగేశ్వరరావు, గూడ రాంబ్రహ్మం, శ్రీను, అద్దంకి తిరుమలయ్య, కారుమంచి గురవయ్య, పొన్నం మురళి, కుక్కల సైదులు, యల్ది వెంకటరమణ, గడ్డం రవి, సుగుణ తదితరులు పాల్గొన్నారు.