Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భౌతికకాయాన్ని సందర్శించిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర
నవతెలంగాణ- సత్తుపల్లి
గోదావరిలో ఆదివారం మధ్యాహ్నం గల్లంతైన విలేఖరి బోయినపల్లి రాజ్ కుమార్ మృతదేహం సోమవారం సాయంత్రం లభ్యమైంది. భౌతిక కాయాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మునిసిపల్ ఛైర్మన్ కూసంపూడి మహేశ్ ఘటనా స్థలానికి వెళ్లి సందర్శించారు. మృతికి గల కారణాలు తెలుసుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుక్కునూరు మండలం పోలీసులు, వైద్యాధికారులతో మాట్లాడి ఇతర కార్యక్రమాలు పూర్తి చేయాలని కోరారు. రాజ్ కుమార్ ఆదివారం గల్లంతైన అప్పటి నుంచి ఆచూకీ కోసం అక్కడి అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడారు. క్షేమంగా తిరిగి రావాలని కోరుకున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభుతి తెలిపారు. ఆయన వెంట కౌన్సిలర్లు చాంద్ పాషా, అద్దంకి అనిల్, మట్టా ప్రసాద్, నాయకులు అంకంరాజు, కంటే అప్పారావు తదితరులు ఉన్నారు.