Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
మండలంలోని రైతు వేదికలు, వైకుంఠధామం ప్రారంభించటానికి హాజరైన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్కు పమ్మి రైతు వేదిక వద్ద సోమవారం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సీపీఐ(ఎం) నాయకులు అందజేశారు. పమ్మి గ్రామంలో నిధులు లేక అభివృద్ధి ఆగిపోయిందని నిధులు మంజూరు చేయాలని సీపీఐ(ఎం) నాయకులు మంత్రి పువ్వాడ దృష్టికి తీసుకెళ్లారు. సీసీ రోడ్లు వైకుంఠధామం, రైతు వేదికకు ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని మంత్రిని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండమీద సువార్త, సీఐటీయు మండల కన్వీనర్ టీఎస్ కళ్యాణ్, సీపీఐ(ఎం) నాయకులు కొండమీది రఘుపతి, బుగ్గవీటి నాగేశ్వరరావు, కొండమీద శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.