Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం ఓపక్క మత విద్వేషాలను పెంచడమే కాకుండా రైతు, కార్మికలను హరించే విదంగా వారి హక్కులను కాలరాస్తూ నిరంకుశంగా పరిపాలిస్తున్నడాని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నబి అన్నారు. బిల్డింగ్ అడ్డమీద సోమవారం సీఐటీయూ నాయకులు ఆలేటి కిరణ్ అధ్యక్షతన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రయివేటీ కరణను ప్రోత్సహిస్తూ పెట్టుబడిదారులకు దేశాన్ని తాకట్టు పెట్టేస్తూ ఇష్టానుసారంగా పరిపాలను చేస్తున్నాడని ఆరోపించారు. క్విట్ ఇండియా ఉద్యమం తరహాలో సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంగం,రైతు సంఘం ఆధ్వర్యంలో ఉద్యమలు చేపట్టి ఈ దేశాన్ని కపడుకుంటామని కేంద్ర ప్రభుత్వంను హెచ్చరించారు. ఈ సభలో రైతు నాయకులు టి.కృష్ణ, సీఐటీయూ నాయకులు ఈసం వెంకటమ్మ, గిరిజన సంగం నాయకులు వజ్జ సురేష్, నాగరాజు, మహమూద్, లక్మన్ తదితరులు పాల్గొన్నారు