Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయంపై ఇంధన ధరల భారం
- వ్యవసాయ రంగంలో పెరిగిన యంత్రాల వినియోగం
- రైతులకు ఇబ్బందిగా మారిన ట్రాక్టర్ కిరాయిలు
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
ఆధునిక వ్యవసాయ రంగంలో పెరిగిన ఇందన ధరలతో రైతు కుదేలవుతున్నాడు. భారం భరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. పెరుగుతున్న డీజిల్ ధరలు రైతులకు అదనపు భారంగా మారాయి. ఆళ్ళపల్లి మండలంలో ధరలకు అనుగుణంగా ట్రాక్టర్లు, యంత్రాల కిరాయిలు కూడా పెరిగాయి. వ్యవసా యంలో ప్రస్తుతం యంత్రాల వినియోగం బాగా పెరి గింది. సాగు పనులకు కూలీలు దొరకక కర్షకులు యం త్రాలతో పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దుక్కి దున్నడం మొదలు పంట చేతికి వచ్చే వరకు యంత్రాలు కీలకంగా మారాయి.
గత రెండు సంవత్సరాలుగా కరోనా నేపథ్యంలో మండలంలో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న రైతులకు మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా డీజిల్ ధరలు చుక్కలు చూపుతున్నాయి.
ప్రస్తుతం వ్యవసాయంలో పశువులు, నాగళ్ల వాడకం తగ్గి ఆ స్థానంలో యంత్రాల వినియోగం తప్పనిసరిగా మారింది. పశువులతో వ్యవసాయం చేసే వారి సంఖ్య నేడు వేళ్లపై లెక్కించే స్థాయిలో పడిపోయింది. ఇప్పుడు పొలాల్లో, చేనుల్లో అంతటా ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు తారస పడుతున్నాయి. పెద్ద రైతులు ట్రాక్టర్లు సొంతంగా కొనుగోలు చేస్తుండగా చిన్న, సన్నకారు రైతులు అద్దె యంత్రాలపై ఆధారపడుతున్నారు. ప్రభుత్వం రైతుబంధు వంటి పథకాలతో అన్నదాతలకు చేదోడువాదోడుగా నిలుస్తున్నా కష్టాలు తప్పడం లేదు. ప్రతి యేటా సాగు వ్యయం అంతకంతకూ పెరుగుతోంది. వర్షాకాలం సీజన్లో వ్యవసాయ పనులు జోరందుకున్న సమయంలో డీజిల్ ధరలు పెరగడంతో స్థానిక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
పెరిగిన పెట్టుబడి వ్యయం...
గత సంవత్సర కాలంగా డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో ట్రాక్టర్ యజమానులు రేట్లు అంతే స్థాయిలో పెంచేశారు. సొంత ట్రాక్టర్లు కలిగిన రైతులు సొంత భూముల్లో పని పూర్తయిన అనంతరం ఇతర రైతుల భూముల్లో దుక్కులు దున్నుతున్నారు. స్థానిక పరిస్థితులను, నేల నైసర్గిక స్వరూపాన్ని బట్టి డీజిల్ ధరల ఆధారంగా దుక్కులు దన్నేందుకు ధరలు ఖరారు చేస్తున్నారు. మెట్ట పంటలకు పొడి దుక్కికి, పొలంలో కేజీవీల్ దుక్కికి వేరువేరుగా ధరలు నిర్ణయించారు. పొడి దుక్కికి గతంలో ఎకరాకు రూ.1600 నుంచి రూ.1800 తీసుకునేవారు. ప్రస్తుతం డీజిల్ ధరలు పెరగడంతో రూ.2000 తీసుకుంటున్నారు. అదే కేజీవీ ల్స్తో బురదలో దున్నడానికి ఎకరాకు రూ.2000 నుంచి రూ.2500 తీసుకునేవారు. డీజిల్ ధరలు పెరగ డంతో రూ.2500 నుంచి రూ.3000 వరకు తీసుకుం టున్నారు. ఇప్పుడు ట్రాక్టర్ కిరాయిలు అదనంగా రూ.300 పైగానే పెరిగాయని రైతులు వాపోతున్నారు.
భారీగా పెరిగిన డీజిల్ ధర...
గతేడాది జూలై నెల ప్రారంభంలో డీజిల్ ధర లీటరుకు రూ.78.94 ఉండగా ప్రస్తుతం ఈ ఏడాది జూలై నెలలో రూ.98.80కు చేరింది. దీనికి తోడు మండలంలో ఇంధన (డీజిల్, పెట్రోల్) బంక్ల ఏర్పాటు లేక రైతులపై మరో రూ.5 నుంచి 10 వరకు అదనంగా భారం పడుతుంది. ఈ సంవత్సర కాలంలో ధరలు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సంవత్సర కాలంలో దాదాపు రూ.25 పెరగటం గమనార్హం. డీజిల్ ధర పెరగడంతో తదనుగుణంగా ట్రాక్టర్ల కిరాయి అదనపు భారం పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు ఉన్న యజమానులు రైతులపై భారం మోపుతున్నారు. పొలం పనులకు ఎకరం దున్నడానికి 5 నుంచి ఐదున్నర లీటర్ల డీజిల్ వినియోగం అవుతుంది. ఈ లెక్కన రోజుకు 10 ఎకరాలు దున్నినా 50 లీటర్ల డీజిల్ పడుతుంది. అయితే ప్రస్తుతం పెరిగిన రేట్ల ప్రకారం దీనికి రూ.5250 వరకు ఖర్చు అవుతోంది.
ఆళ్ళపల్లి మండలంలో ట్రాక్టర్ కిరాయిలు (ఎకరాకు) ధరల పట్టిక...
గతంలో దుక్కికి రూ.1400 నుంచి రూ.1600 వరకు దమ్ముకు రూ.1600 నుంచి రూ.1800 వరకు. ప్రస్తుతం దుక్కికి రూ.1800 నుంచి రూ.2000 వరుకు. దమ్ముకు రూ.2200 నుంచి రూ.3000 వరకు తీసుకుంటున్నారు.
డీజిల్ ధరలతో ఇబ్బంది పడుతున్నాను
గతంలో ఎన్నడూ లేని విధంగా డీజిల్ ధరలు పెరగ డంతో ట్రాక్టర్ యజమానులు ఎకరాకు అదనంగా రూ.300 నుంచి రూ.400 వరకు తీసుకు ంటున్నారు. ఇప్పటికే వ్యవసా యానికి పెట్టుబడి పెట్టడానికి ఇబ్బందు లు పడుతున్నాను. నాలాంటి సన్నకారు రైతులకు ఈ డీజిల్ ధరలు పెనుభారంగా మారాయి.
గొగ్గెల రామయ్య, చింతోళ్లగుంపు గ్రామం.
ఇంధన ధరలు తగ్గిస్తే బాగుంటుంది
ఇంధన ధరలు పెరగడంతో దున్నకం ఇబ్బందిగా మారింది. గతంలో ఎకరాకు రూ.1800 వరకు దున్నేవారు. ప్రస్తుతం రూ.2500 వరకు తీసుకుంటు న్నారు. మాలాంటి మధ్యతర గతి రైతులకు ధరలు భరించడం ఇబ్బందిగానే ఉంది. డీజిల్ ధరలు తగ్గిస్తే బాగుంటుంది.
- నల్లమాసు ఉప్పయ్య, ఆళ్ళపల్లి మండల కేంద్రం