Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్డీ సబ్ డివిజన్ కార్యదర్శి సత్యం
నవతెలంగాణ-గుండాల
కొమరం భీం, అల్లూరి సీతారామ రాజుల స్పూర్తితో పోరాడితేనే ఆదివాసీ లకు మనుగడ అని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి ఎదల్లపల్లి సత్యం అన్నారు. ప్రపంచ ఆదివాసి పోరాట దినం సందర్భంగా ఎన్డీ ఖమ్మం, వరంగల్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ప్రచురించిన పోస్టర్ను సోమవారం మండల కేంద్రంలోని కొమరం విగ్రహం దగ్గర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ ఆదివాసి పోరాట దినోత్సవం సందర్భంగా ఏరియా కమిటీ పరిధిలో 7న భద్రాచలం 8న ఇల్లందు 9న కొత్తగూడెం కేంద్రాలతో పాటు మహబూబాబాద్, వరంగల్, భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, ఖమ్మం జిల్లాలలో ఆదివాసి పోరాట దినోత్సవాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసి వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని వివరించారు. ఆదివాసీలు బతకాలంటే అడవులపై జల్ జంగల్ జమీన్ నినాదంతో అడవులపై హక్కు మాదని యుద్ధం చేసిన సమ్మక్క, సారక్క స్ఫూర్తితో ఆదివాసీలు ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జె.సీతారామయ్య, ఎండి.రాసుద్దీన్, బి.రాంసింగ్, గుండాల మాజీ ఎంపీపీ ఈసం కృష్ణ, రామయ్య, రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
బూర్గంపాడు : ఆగస్టు 9వ తేదీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని హక్కుల పరిరక్షణ దినోత్సవంల జరిపించాలని ఎన్డీ నాయకులు పూన్నం చంద్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సోమవారం ఎన్డీ భద్రాచలం సబ్ డివిజన్ కమిటీ నాయకులు గీత, ఆదిలక్ష్మిలతో కలిసి ఆగస్టు 9న పరిరక్షణ దినంగా జరపాలని పిలుపుతో కూడిన పార్టీ ఏరియా కమిటీ గోడ పత్రికను ఆవిష్కరించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు సోడే రాజు, వెంకయ్య, రామకృష్ణ, కొండలరావు, వైయస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.