Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజరు కుమార్
నవతెలంగాణ-ముదిగొండ
దళిత బంధు పథకం దేశానికే దారి చూపే విధంగా ఉంటుందని రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజరు కుమార్ అన్నారు. మండలం పరిధిలోని, సోమవారం ముదిగొండ, చిరుమర్రి, పమ్మి, వల్లభి గ్రామాల్లో రైతు వేదికలు, వైకుంఠ దామాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. వల్లభిలో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ ఈనెల 16న హుజురాబాద్ లో దళిత బంధు పథకం ప్రారంభించిన అనంతరం ఇది రాష్ట్రానికి మొత్తం వర్తింపచేస్తామని ఆయన అన్నారు. ప్రతిపక్ష నాయకులు దీనిపై అవాకులు చెవాకులు పేలుతున్నారని వారికి ఇది మింగుడు పడటం లేదని విమర్శించారు. జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ మాట్లాడుతూ మంత్రి పువ్వాడ చొరవతో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. మధిరలో 100 పడకల ఆసుపత్రి రోడ్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చలువే నన్నారు. విత్తనాభివద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. మధిర ముదిగొండలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను గతంలో మంజూరు చేయించానని వల్లభి గ్రామాభివృద్ధికి తమవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
బోనాలు మహిళా కోలాటం మేళతాళాలతో మంత్రి, జిల్లా పరిషత్ చైర్మన్‌కు ఘన స్వాగతం
మండల పర్యటనలకు వచ్చిన మంత్రి పువ్వాడ అజరు కుమార్, పరిషత్ చైర్మన్ లింగాలకమల్ రాజు, కలెక్టర్ గౌతమ్‌లకు వల్లభిలో ఘనంగా స్వాగతం పలికారు. రైతు వేదికల స్థల దాతలకు చిరుమర్రి మల్లన్న పాలెం పమ్మి గ్రామాల్లో మంత్రి వారికి శాలువాలతో సన్మానించారు. తొలుత ముదిగొండ గ్రామ రైతు వేదిక నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం వల్లభి వరకు ఘనంగా స్వాగతం పలికారు.
ముదిగొండలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు వినతి
మండల కేంద్రమైన ముదిగొండ నుండి వెంకటాపురం సెయింట్ ఆన్స్ స్కూల్ వరకు ముదిగొండ బస్టాండ్ నుండి పాత బస్టాండ్ స్టాప్ వరకు రోడ్లు వెడల్పు చేసి మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని ముదిగొండ సర్పంచ్ మందరపు లక్ష్మి మంత్రి అజరు కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సైడ్ నిర్మాణం కూడా నిధులు మంజూరు చేయాలని ఆమె ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. పరిశీలించి సెంటర్ లైటింగ్ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పలు సమస్యలపై సర్పంచ్ కృష్ణకుమారి మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, పలువురు జిల్లా ఉన్నతాధికారులు ఎంపీపీ సామినేని హరిప్రసాద్, జెడ్పిటిసి పసుపులేటి దుర్గ, మేడేపల్లి ముదిగొండ సొసైటీ అధ్యక్షులు సామినేని వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మీగడ శ్రీనివాస్ యాదవ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ పోట్ల వెంకట ప్రసాద్, డీసీసీవి సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ వేముల శ్రీనివాస్, ఏఎంసి డైరెక్టర్ బంకా మల్లయ్య పాల్గొన్నారు.
వల్లభిలో టీడీపీ, కాంగ్రెస్ నుండి 30 కుటుంబాలు చేరిక
వల్లభి గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు పోట్ల రవి ఆధ్వర్యంలో జిల్లా మంత్రి అజరు కుమార్, జెడ్పీచైర్మెన్ చైర్మన్ కమల్ రాజు సమక్షంలో 30 కుటుంబాలు చేరాయి. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
- ముదిగొండలో కలెక్టర్ పలె ప్రకృతి వనంను పరిశీలించారు.