Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-వైరా టౌన్
వైద్య, ఆరోగ్య శాఖలో అనేక సంవత్సరాలుగా సేవ చేస్తున్న ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి చూపిందని సీఐటియు వైరా పట్టణ కన్ను అనుమోలు రామారావు అన్నారు. మంగళవారం సిఐటియు ఆద్వర్యంలో ఆశావర్కర్లు వైరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వైరా వైద్యాధికారి డాక్టర్ శశిధరుకు అందించారు. ఈ సందర్భంగా వైరా పట్టణ సిఐటియు కన్వీనర్ అనుమోలు రామారావు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఆశా వర్కర్లు రేయనకా, పగలనకా తమ ప్రాణాలను, కుటుంబాను పట్టించుకోకుండా కరోనా బారినపడిన వారికి సేవ చేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిండు సభలో ప్రకటించిన పీఆర్సీ ఆశావర్కర్లు అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి కనీస వేతనం 21వేల రూపాయలు ఇవ్వాలని, ఆశావర్కర్లకు పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు ఆదిలక్ష్మి, సుజాత, విజయ, రేణుక, అమత, లలిత, పద్మ, రజిని, మంగ పాల్గొన్నారు.