Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టు 9న కలెక్టరేట్ ముట్టడి
- వ్యకాస జిల్లా నాయకుడు బందెల వెంకయ్య
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 9న రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటియు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు బందెల వెంకయ్య అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సేవ్ ఇండియా ఉద్యమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆ ప్రచారంలో భాగంగా మండలంలోని ఎం. వెంకటాయపాలెం గ్రామంలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులపై,కూలీలపై కార్మికుల పై కక్ష పూరితంగా వ్యవహరించడం దారుణం అన్నారు. అనంతరం సర్పంచ్ మందాటి సంధ్యారాణికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పెరుమల్ల పల్లి మోహన్ రావు, వ్యకాస నాయకులు వడ్లమూడి నాగేశ్వరరావు, రైతు సంఘం మండల నాయకులు చావా నాగేశ్వరరావు ,విజయ, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.