Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెంటు భూమి లేదంటున్న రైతులు
నవతెలంగాణ-కల్లూరు
రెవెన్యూ రికార్డుల్లో తన పేరు మీద 17 ఎకరాల భూమి ఉందంటూ ఓ అధికారి రైతుల్ని వేధిస్తున్న సంఘటన మండలంలోని చందుపట్ల గ్రామంలో చోటుచేసుకుంది. మంగళవారం ఆ గ్రామానికి చెందిన రైతులు తమను మనోవేదనకు గురి చేస్తున్నాడని విలేఖర్ల ముందు వాపోయారు. ఈ సందర్భంగా బాధిత రైతులు గ్రామ మాజీ సర్పంచ్లు, సర్పంచ్ విలేకర్లతో మాట్లాడుతూ 1955 సంవత్సరం నుండి మాతాతల తండ్రి దగ్గర నుండి ఈ భూమిని సాగు చేసుకోంటూ జీవిస్తున్నాము. అప్పటి నుండి ప్రభుత్వ పరంగా అన్ని తమకే ఉన్నాయి. ప్రభుత్వం పాస్ పుస్తకాలు ఇచ్చిన దగ్గర నుండి ఉన్నాయని చూపించారు. తెలంగాణ వచ్చిన తరువాత కొత్తగా ఇచ్చిన పాస్ పుస్తకాలు మా పేరు మీద వచ్చి రైతు బంధు కూడా వస్తుందని తెలిపారు. అప్పటిలో సోమరాజు సూర్యనారాయణ కారణంగా పనిచేసారు. అప్పుడు 355 /1ఈఉరూ సర్వే నెంబరులో 126 ఎకరాలు ఉంది. అందులో 17 ఎకరాలు భూమి వారి పేరు మీద ఉంది. అప్పటిలోనే వారి అవసరాల కోసం అమ్ముకొన్నారు. వారు గ్రామ నుండి వెళ్ళు సమయంలో సెంటు భూమి లేక పూట గడవని పరిస్థితిలో ఉన్నారని మాపెద్ధలు చెప్పేవారని తెలిపారు. వారికి భూమి ఉంటే అప్పుడే అమ్ముకొనే వారని పేర్కొన్నారు. భూములు మాపేరున ఉన్న రెవెన్యూ రికార్డులో అధికారులు తొలిగించకపోవటంతో దానిని ఆసరా చేసుకోని సోమరాజు సూర్యనారాయణ కుమారుడు వెంకట రాఘవేంద్రరావు ప్రస్తుతం పోలీసు శాఖలో డీఎస్పీగా పనిచేస్తున్నారు. వారు భూములకు ధరల పెరగటంతో ఆ సర్వే నెంబరులో తమ భూమి ఉందని అధికారులతో ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు. కోర్టుకు వెళ్ళారు. కోర్టు రైతులకు నోటీసులు ఇచ్చారు. రైతులు తమ దగ్గర ఉన్న ఆధారాలు చూపించటంతో కోర్టు తమకు అనుకూలంగా స్పందించి, మీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని రావాలని అడిగింది. యర్రబోయనపల్లి నుండి చండ్రుపట్ల కు రోడ్డు వేస్తుంటే అభూమి నాదని సుమరు 500 మిటర్లు బి టి రోడ్డు వేయనియకుండ అడ్డుకోన్నరు. మళ్ళీ సర్వేకు రావాలంటు వత్తిడి తెస్తు రైతులును వేదిస్తున్నారని ఆందోళన చేంది మనోవేదనకు గురౌంతున్నమని తెలిపారు. ఈ అధికారి వేధింపుల నుండి తమను రక్షించాలని జిల్లా అధికారులను బాధిత రైతులు కాటంనేని నరసింహారావు, పైళ్ళ మల్లయ్య, వల్లపునేని వెంకటేశ్వర్లు, కె ప్రకాశరావు, సర్పంచ్ గొల్ల మందల ప్రసాద్, మాజీ సర్పంచులు వి బాస్కర్ రావు, వి భద్రయ్య, జక్కంపుడి కిషోర్, అళ్ళ సత్యనారాయణ, కె వెంకట నర్సయ్య, కోమ్మినేని శ్రీనివాసరావు, వి శ్రీనివాసరావు, వి రవికుమార్, కొమ్మినేని రామారావు, వేడుకొంటున్నారు.