Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
మండలపరిధిలో వెంకటాపురం గ్రామానికి చెందిన బంక లావణ్య పేదింటి బిడ్డ లివర్ హార్ట్ సమస్యతో అనారోగ్యానికి గురై బాధపడుతూ వైద్య ఖర్చులకు రూ 10 లక్షల వరకు ఖర్చు అవుతాయని వైద్యులు వివరించగా డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. లావణ్య తల్లిదండ్రులు రోజువారీ వ్యవసాయ కూలీపనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్న ఆపేద కుటుంబానికి పెద్దకష్టం వచ్చి పడింది. ఈ క్రమంలో వారి దీనస్థితిని ''నవతెలంగాణ దినపత్రిక''లో గత నెల 24వ తేదీన ''పేదింటిబిడ్డ సాయం కోసం ఎదురుచూపు'' అనే కథనాన్ని ప్రచురించింది. ఈకథనానికి స్పందించిన ముదిగొండ సొసైటీ చైర్మన్ తుపాకుల యలగొండస్వామి మానవతా దృక్పథంతో తనవంతు సాయంగా సొసైటి కార్యాలయంలో లావణ్యతోపాటు కుటుంబసభ్యులను ఆహ్వానించి గత నెల25వ తేదీన రూ15 వేలు ఆర్థిక సహాయం అందించిన విషయం విధితమే. కాగా యలగొండస్వామి దంపతులు మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకొని రూ.50వేల ఆర్థికసాయం ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ గౌతమ్ చేతుల మీదుగా ఆ మొత్తాన్ని లావణ్యకు మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో ముదిగొండ సొసైటీ చైర్మన్ తుపాకుల యలగొండస్వామి, వనంవారికిష్టాపురం గ్రామసర్పంచ్ తుపాకుల రమాదేవి పాల్గొన్నారు.