Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్‌ను అడ్డంపెట్టుకొని అవినీతి
- 10న గ్రామంలో బహిరంగ చర్చ
నవతెలంగాణ-కారేపల్లి
గ్రామపంచాయతీలో అబివృద్ధి పనుల్లో జరిగిన అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని కారేపల్లి మండలం బాజుమల్లాయిగూడెం గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం కారేపల్లిలోని సీపీఐ(ఎం) కార్యా లయంలో బాజుమల్లాయిగూడెం గ్రామస్తులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన అభివృద్ధి పనులపై ఈనెల 1వ తేదిన మాజీ సర్పంచ్ దారావత్ సైదులు ఆధ్వర్యంలో సమాచార హక్కు కార్యకర్తలు గ్రామ సభ నిర్వహించి విచారణ చేశారన్నారు. అభివృద్ధిపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన సర్పంచ్ కోరం కోటమ్మ, ఉపసర్పంచ్ దుద్దుకూరి ఉషారాణిలు కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతు న్నారని, రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆదివాసి మహిళా సర్పంచ్‌ను అడ్డం పెట్టుకొని కొందరు గ్రామపంచయతీలో పెత్తనం చేస్తున్నారని, ఆవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. సీపీఐ మాజీ ఎంపీటీసీ ధనరాజ్ సీపీఐ(ఎం) వారు ఆదివాసి మహిళా సర్పంచ్‌ను వేధిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నాడని, ఆదివాసీలను వేధించేది ఎవరో ఈనెల 10వ తేదిన గ్రామంలో బహిరంగ చర్చకు రావాల న్నారు. 10 ఏండ్లగా గ్రామ పంచాయతీలో గుమస్తాగా పని చేసిన మహిళ స్వర్ణను వేధించటమే కాక కొలువు నుండి తొలగిం చారన్నారు. ఆదివాసీల భూములను లాక్కొంటుంటే నోరుమెదపని సీపీఐ వారు ఆదివాసిలపై మొసలి కన్నీరు కార్చుతున్నారని విమర్శించారు. సర్పంచ్ ఆదివాసీ మహిళా అయినా పెత్తనం అగ్రకులాలవారిదేనన్నారు. ఆదివాసీలు, బంజరా గిరిజనుల తరుపునా పోరాడేది సీపీఐ(ఎం) మాత్రమేనన్నారు. గ్రామంలో ఇంకుడు గుంటలకు బిల్లులు ఇప్పించలేదని, హరితహారం మొక్కల సంరక్షణ పేరుతో పంచాయతీ డబ్బు కాజేశారన్నారు. రెండున్నర ఏండ్లలో ఒక్క సీసీ రోడ్డు కూడా నిర్మాణం చేయలేదన్నారు. బాజుమల్లాయి గూడెంలో అవినీతిని కప్పి పుచ్చుకోవటానికి సీపీఐ(ఎం) నాయకులపై నిందలు మోపు తున్నారన్నారు. ఆర్టీఐతో వెలుగులోకి వచ్చిన అంశాలపై ఈనెల 10న జరిగే గ్రామసభకు సర్పంచ్, ఉపసర్పంచ్లు రావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు మద్దెల నాగయ్య, వల్లబోయిన కొండలరావు, గ్రామస్తులు ఈసం అలివేలు, మోకాళ్ల రజిత, కొండెం వెంకటేశ్వర్లు, సురభి నరేష్ తదితరులు పాల్గొన్నారు.