Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్సిరెడ్డి
నవతెలంగాణ- ఖమ్మం
పౌరుల తక్షణ సమస్యలైన విద్య, వైద్యంను ప్రభుత్వమే బాధ్యతగా నిర్వహించాలని తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, ఎంఎల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక మంచికంటి భవన్లో తెలంగాణ స్పందన వేదిక జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో విద్య, వైద్య రంగాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయన్నారు. దీనివల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం చాలా నష్టపోతున్నారన్నారు. వారిని చైతన్య పరిచే దిశగా ఇలాంటి వేదికలు చాలా అవసరం అన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ వేదికలు చురుకుగా పని చేయాలన్నారు. ఇది ఒక సామాజిక స్పృహతో బాధ్యతగా వ్యవహరించాల్సిన వేదిక అని, అందరూ స్పందించి ఈ పనిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు అధ్యక్షులుగా నెల్లూరు వీరబాబు, ప్రధాన కార్యదర్శి గావై రవికుమార్, కోశాధికారిగా వై.మధుసూదన్ రావు, ఉపాధ్యక్షులుగా సత్తెనపల్లి నరేష్, ఝాన్సీ కుమారి, శరత్ బాబు, షాచేద్ర బాబు, కార్యదర్శులుగా కుటుంబరావు, భాస్కర్‌రావు, ప్రసాదరావు, మీరా హుస్సేన్‌తో పాటు 15 మందితో కార్యదర్శి సభ్యులుగా నియమించారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధేశ్యాం, రాష్ట్ర ఉపాధ్యక్షులు మంగ, గౌరవ సలహాదారులు దత్తు పాల్గొన్నారు.