Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని
నవతెలంగాణ-సుజాతనగర్
ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి కామ్రేడ్ సున్నం రాజయ్య అని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య అన్నారు. మంగళవారం ఆయన రాజయ్య ప్రథమ వర్ధంతి సభ స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. మొదట ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి భద్రాచలం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని అన్నారు. యువతను పార్టీ వైపు నడిపించడానికి గ్రామీణ క్రీడలు నిర్వహించారని అన్నారు. తనకున్న పదిహేను ఎకరాల భూమిని ఆశ్రమ పాఠశాల చెరువు నిర్మాణానికి ఇచ్చారని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సాదా జీవితాన్ని గడిపారని అన్నారు. నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో బలంగా వినిపించారని అన్నారు. ఆయన మన మధ్య లేకపోవడం పార్టీకి, ప్రజానీకానికి తీరని లోటని ఆవేదన చెందారు. నేటి యువత ఆయన భావాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వీర రమేష్, కాట్రాల తిరుపతిరావు, శ్రీను, కృష్ణ, బాలు, వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, ఐలయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : భద్రాచలం నియోజక వర్గ శాసనసభ్యుడుగా మూడు పర్యాయాలు ప్రాతినిద్యం వహించిన అమరజీవి సున్నం రాజయ్య పేరును ప్రగళ్లపల్లి ఎత్తి పోతల పధకానికి నామకరణం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యలమంచి రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమరజీవి సున్నం రాజయ్య ప్రథమ వర్ధంతి వేడుకలను ములకపాడులోని యలమంచి సీతారామయ్య భవన్తో పాటు దుమ్ముగూడెం, తూరుబాక సీపీఐ(ఎం) గ్రామ శాఖల ఆద్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజయ్య చిత్ర పటానికి నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా రవికుమార్ మాట్లాడారు. భద్రాచలం నియోజవర్గం అన్ని రంగాలలో అభివృద్ది చెందింది అంటే ఇక్కడ కమ్యూనిస్టు పార్టీలకు చెందిన శాసన సభ్యులు ప్రాతినిద్యం వహించడ వల్లనే అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ, శాఖా కార్యదర్శులు బర్రి నర్సింహారావు, కుమ్మరికుంట సాంబశివరావు, రైతు సంఘం మండల కార్యదర్శి బొల్లి సూర్యచందర్ రావు, లకీëనగరం సర్పంచ్ సరియం రాజమ్మ, ఉపసర్పంచ్లు గుడ్డ రామ్మోహన్ రెడ్డి, బొల్లి సత్యనారాయణ, సీనియర్ నాయకులు చంద్రయ్య, శ్రీనివాసరెడ్డి, బేగ్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చండ్రుగొండ : మండల సీపీఐ(ఎం) కార్యాలయంలో పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రథమ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ వర్ధంతి సభలో పార్టీ మండల కార్యదర్శి యాసా నరేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా రాజయ్య చిత్రపటానికి చండ్రుగొండ, ఆయన పాలెం గ్రామ శాఖ కార్యదర్శులు రాజా, విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యు లు రామడుగు వెంకటాచారి, ఎస్.వి పార్టీ సభ్యులు వీరభద్రం, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సారపాక : ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే వ్యక్తి కామ్రేడ్ సున్నం రాజయ్య అని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు. మండల పరిధిలోని సారపాకలో పాపినేని సరోజన అధ్యక్షతన సున్నం రాజయ్య ప్రథమ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని సున్నం రాజయ్య చిత్రపటానికి పూలదండ వేసి నివాళులర్పించారు. జోహార్లు సున్నం రాజయ్య మీ ఆశయాలను సాధిస్తాం అని నినాదాలు చేశారు. అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ శాఖ కార్యదర్శులు ఎస్.కె అభిద, వెంకటేశ్వర్లు, తిరుపతయ్య, మరియమ్మ, రమణ, ప్రతాప్, రమేష్, పుష్ప తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు : సున్నం రాజయ్య ప్రథమ వర్ధంతి సభను మంగళవారం సీనియర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు పాల్గొని రాజయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళుర్పించారు. అనంతరం మండల కార్యదర్శి కాటిబోయిన నాగేశ్వరరావు మాట్లాడుతూ... సున్నం రాజయ్య ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొల్లం రాజు, నర్సింహా రావు, నర్సయ్య, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
టేకులపల్లి : సున్నం రాజయ్య స్ఫూర్తితో పోరాటాలు ఉధృతం చేస్తామని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం రాజయ్య ప్రధమ వర్ధంతి పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు. మండల కార్యదర్శి ఈసం నరసింహా రావు, మండల కమిటీ సభ్యులు వీరన్న, కుమారి, శ్రీను, లక్ష్మినారాయణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.