Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డు పోశారు.. వంతెన మరిచారు
- వాన వస్తే వాగు దాటాలేని పరిస్థితి
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
నీళ్లు, నిధులు, నీయమాకాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిధులు ఉన్న అటు ప్రభుత్వం కానీ ఇటు మండలంలో ఉన్న అధికా రులు గాని రైతులు బాధ ఎవరూ పట్టించు కోవడం లేదని మర్రిగూడెం రాజాపురం గ్రామ ప్రజలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని మర్రిగూడెం రాజాపురం మధ్య సుమారు 3 కిలోమీటర్ల తారు రోడ్డు రూ.3 కోట్లు పెట్టి పోసి రెండు సంవత్సరాలు గడుస్తున్నా సుమారు 70 మీటర్లు ఉన్న వంతెన నిర్మాణం చేపట్టకపోవడంతో తారు రోడ్డు పోసిన ఉపయోగం లేకుండా పోయిందని ఇరు గ్రామాల ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. మర్రిగూడెం గ్రామ ప్రజలకు రాజాపురం గ్రామంలో వరి పొలాలు ఉండటంతో వర్షకాలంలో మర్రిగూడెం నుండి వాగు దాటుకుంటు ట్రాక్టర్లు తీసుకొని వచ్చి వరి పొలాలు దుక్కి దున్నుకొని పోవాలి. అదేవిధంగా వరి నాట్లుకు కూడా ఇరు గ్రామాల ప్రజలు పొలాల్లోకి వెళ్లాలన్న వాగు దాటాలి. వరి పంట పండిన పంటను ఇంటికి తీసుకు పోవాలన్నా, పశువులు మేతకు వరి గడ్డి ట్రాక్టర్లు సహాయంతో తీసుకుపోవాలన్నా వాగు దాటాల్సిందే. కానీ చిన్నపాటి వర్షానికి కూడా ఎగువ అటవీ ప్రాంతం నుండి వరద రావడంతో వాగు పొంగిపొర్లిపోవడంతో 70 మీటర్లు వంతెన లేక మర్రిగూడెం గ్రామ ప్రజలు వరి పొలాలకు రావడానికి అన్నపురెడ్డిపల్లి నుండి రాజాపురం మీదగా సుమారు 10 కిలోమీటర్లు అదనంగా తిరిగి రావాల్సి వస్తుంది. మరో మార్గం అయిన అబ్బుగూడెం నుండి రాజాపురం మీదగా సుమారు 9 కిలోమీటర్ల అదనంగా తిరిగి రావాల్సి వస్తుందేనని రైతులు ఆందోళన చెందుతు న్నారు. తారు రోడ్డు పోసి సంవత్సరాలు గడుస్తున్నా అటు రోడ్లు భవనాల శాఖ అధికారులు గాని, మండ లంలోని అధికారులు గాని పట్టించుకోవడం లేదని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. నూతన మండలం ఏర్పడి న తరువాత ఇద్దరు శాసన సభ్యులు మారిన వాగుకు వంతెన అయితే రాలేదు. గత సంవత్సరం వర్షకాలం లో వాగుదాటాడానికి ఓ రైతు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా అకస్మాత్తుగా పై నుండి వరద ఒక్క సారిగా రావడంతో ద్విచక్ర వాహనం రైతు వాగులో కొట్టుపోయి, సాయంతో భయట పడ్డ సంఘటనలు ఉన్నాయన్నారు. ఇంతే గాక మర్రిగూడెం నుండి 102, 108 ఎర్రగుంట ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి గర్భిణీ లను వర్షకాలంలో ఆశ వర్కర్లు తీసుకుపోవాలన్న అత్యవసర సేవలకు తక్కువ సమయంలో హాస్పిటల్కి చేరాలన్న వర్షకాలం అనేక సమస్యలు ఎదుర్కొంటు న్నామని ఇప్పటికైనా రోడ్లు భవనాలు శాఖ మంత్రి ఓ సారి వాగు వైపు చూడాలని, వాగుకు వంతెన నిర్మిణాం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఇరు గ్రామాల రైతులు ప్రజలు కోరుకుంటున్నారు.