Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 9న జరుగు దేశవ్యాప్త నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రజా సంఘాల జిల్లా నేతల పిలుపు నిచ్చారు. మంగళవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం, సీఐటీయూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 9వ తారీకున జరుగు దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని లక్ష్మీదేవి పల్లి మండలం రేగళ్ళ బావోజి తండ గ్రామ పంచాయతీ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమం నిర్వహించి, పంచాయతీ కార్యదర్శులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జాటోత్ కృష్ణ, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎంవి.అప్పారావు, రైతు సంఘం జిల్లా నాయకులు వాంకుడోత్ కోబల్ పాల్గొని మాట్లాడుతూ... దేశంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఇతర రంగాలను కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారి శక్తులకు కట్టబెడుతున్నారన్నారు. 18 రకాల సరుకులు రేషన్ షాపుల ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిబ్బందికి రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించాన్నారు. డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ఇతర నిత్యావసర సరుకుల ధరలను అరికట్టాలన్నారు. ఈ సమస్యలపై వివిధ ప్రజా సంఘాలు ఈనెల 9న జరిగే దేశవ్యాప్త నిరసన కార్యక్రమం కిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో భారత్ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమాలో ఆయా ప్రజా సంఘాల నాయకులు నల్లమల సత్య నారాయణ, ఉప్పెన పల్లి నాగేశ్వరావు, ధరావత్ వెంక న్న, నుణవత్ సూర్య, విజరు, సురేష్, రాజా, నరేష్, హరి, తేజావత్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
జూలూరుపాడు కేంద్ర ప్రభుత్వం విధానాన్ని నిరసిస్తూ ఆగస్ట్ 9న నిర్వహించే దేశ వ్యాపిత బంద్‌లో యవత్ ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య అన్నారు. మంగళవారం పార్టీ గుండెపుడి గ్రామ శాఖ మహాసభ బాణొత్ మధు అధ్యక్షతన జరిగిన మహసభలో పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 3 నల్ల చట్టాలను చేయడం దుర్మార్గపు చర్య అని అన్నారు. ఈ మహాసభ ప్రరంభ శుచిగా పార్టీ పథకాన్ని ఐలయ్య ఎగురవేశారు. ఈ మహసభలో పార్టీ మండల కార్యదర్శి బిక్షం, బాణోత్ ధర్మ, కనకరత్నం, దానయ్య, భద్రు, భూక్య సురెష్, చందర్ రావు, లక్మా, సంజీవ రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచ రూరల్ ఈ నెల 9న జరిగే అఖిల పక్ష సత్యాగ్రహ దీక్షను జయప్రదం చేసి ప్రభుత్వాలకు హెచ్చరిక కావాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గూడెపురి రాజు కోరారు. మంగళవారం పాల్వంచ మండల పరిధిలోని ఉల్వనూరు జగన్నాధపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ఆయన ఆశ వర్కర్ల సమస్యలపై సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.