Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-సత్తుపల్లి
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను క్విట్ ఇండియా స్ఫూర్తితో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో కళ్యాణం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజా, కార్మిక చట్టాల సవరణను ఉపసంహరించుకోవాలన్నారు. రైతు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలన్నారు. రుణ విమోచన చట్టాన్ని అమలు చేయాలన్నారు. ఉపాధి కూలీలకు రూ. 600 రోజు కూలి ఇవ్వడంతో పాటు 200 పనిదినాలు కల్పించాలన్నారు. ప్రభుత్వ రంగాల్లో వాటాల విక్రయాలను ఆపాలన్నారు. ఈ సమావేశంలో రైతుసంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేశ్, వ్యకాస జిల్లా అధ్యక్షుడు మెరుగు సత్యనారాయణ, రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు, మండల కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు, రైతుసంఘం నాయకులు రావుల రాజబాబు, వెంకట్రావు, రామకష్ణ, రామారావు పాల్గొన్నారు.