Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుమార్తె మరణంతో మనస్థాపం చెంది భార్యాభర్తల ఆత్మహత్య
- గోదావరిలో లభ్యమైన మృతదేహాలు
నవతెలంగాణ-బూర్గంపాడు
కుమార్తె అనారోగ్యంతో మృతిచెందగా ఆ మరణాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడారు. ఆ మృతదేహాలు బూర్గంపాడు శివారులో ఉన్న పంపుహౌస్ సమీపంలో గోదావరిలో లభ్యమైన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ ఈసీఎల్ కు చెందిన పమ్మి లక్ష్మణాచారి(55), హేమలత(48) దంపతుల కుమార్తె పదిరోజుల కిందట అనారోగ్యంతో ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. అప్పటి నుంచి కుమార్తె లేని జీవితం మాకొద్దంటూ మనోవేదనకు గురై బాధపడుతుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉన్న హేమలత సోదరుడు వేమనకుమార్ వారిని తన ఇంటికి బుధవారం తీసుకువచ్చాడు. వేమనకుమార్ పనినిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో 'నా బిడ్డ లేని జీవితం మాకు వద్దు అందుకే చావడానికి వెళుతున్నాము. సారీ వేమండు... మా కోసం వెతకమాకుండి... నా బిడ్డకు అన్ని కార్యక్రమాలు మంచిగా చేయండి...' అని సూసైడ్ నోట్ వదిలిపెట్టి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి బూర్గంపాడు పంపు హౌస్ వద్ద ఆ దంపతుల మృతదేహాలు లభ్యం కావడంతో పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లభ్యమైన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు.