Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.7000 కోట్ల డిపాజిట్లు సేకరించి 2015లో చేతులేత్తిన సంస్థ
- సుమారు 100 మంది ఏజెంట్లు, కస్టమర్లు ఆత్మహత్యలు
- బాధితులకు డబ్బులు చెల్లిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
- తెలంగాణలో 6 సంవత్సరాలుగా బాధితుల ఎదురుచూపు
- నేడు జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు
నవతెలంగాణ-వైరా టౌన్
1995లో ప్రారంభించిన అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని ప్రజలను నమ్మించి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో సుమారు 7000 కోట్ల రూపాయిల డిపాజిట్లను సేకరించారు. సేకరించిన డిపాజిట్లతో కొన్ని కంపెనీలు, రియల్ ఎస్టేట్ వెంచరులను ప్రారంభించారు. విల్లాలను కొన్నారు. రిసార్ట్స్ నిర్మించారు. 2015లో డిపాజిట్ దారులకు డబ్బులను తిరిగి చెల్లించకుండా అగ్రిగోల్డ్ యాజమాన్యం చేతులు ఎత్తెసింది. ప్రభుత్వం యాజమాన్యాన్ని అరెస్టుచేసి చేతులు దులుపుకున్నారు.