Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మధిర
కమ్యూనిస్టు పార్టీ పోరాట యోధుడు, సీపీఐ(ఎం) మధిర పట్టణ నాయకులు కామ్రేడ్ మండవ కృష్ణారావు(64) గురువారం తెల్లవారు జామున గుండెపోటుతో మృతి చెందారు. విషయాన్ని తెలుసుకున్న సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, బుగ్గ వీటి సరళ, బత్తుల హైమావతి, జిల్లా కమిటీ నెంబర్లు చింతలచెరువు కోట కోటేశ్వరరావు, ఝాన్సీ సందర్శించి మృతదేహానికి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతమ యాత్రలో పాల్గొని జోహర్లు అర్పించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సంతాప సభలో వారు మాట్లాడుతూ.. కృష్ణారావు పార్టీలో చాలా చురుగ్గా పని చేసేవాడిని, అనారోగ్య పరిస్థితి కూడా లెక్కచేయకుండా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే వారిని గుర్తుచేశారు. వ్యవసాయ కార్మిక సంఘంలో పనిచేస్తూ చురుగ్గా సభ్యత్వాలు నమోదు చేశారని, నవతెలంగాణ పేపర్ ఏజెంట్ గా పనిచేసి పేపరు సర్క్యూలేషన్ పెరగడంలో శక్తి మేరకు కృషి చేశారని తెలిపారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని, వారి కుటుంబానికి రాష్ట్ర కమిటీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపారు. పలువురు నాయకులు మాట్లాడారు. ఈ సంతాప సభలో సీపీఐ(ఎం) పార్టీ సీనియర్ నాయకులు కట్టా గాంధీ, మధిర టౌన్ కార్యదర్శి నరసింహారావు, వివిధ మండలాల కార్యదర్శులు మందా సైదులు, దొండపాటి నాగేశ్వరరావు, మడుపల్లి గోపాల్ రావు, దివ్వెల వీరయ్య, కట్టా కృష్ణార్జున రావు, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మద్దాల ప్రభాకర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వడ్రాణపు మధు, దిరిశాల జగన్ మోహన్ రావు, రాధాకృష్ణ, నరసింహారావు, అఖిల పక్ష నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు.