Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
దేశవ్యాప్తంగా విద్యాసేవలందించడంలో ముందున్న సెంట్రల్ బుక్స్ వారి బుక్ ఫెయిర్ శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఖమ్మంలో నిర్వహిస్తున్నట్లు జాన్సన్ కిడ్స్ పాఠశాల కరస్పాండెంట్ మమత, ప్రశాంతి ఆస్పత్రి వైద్యులు ప్రశాంతి తెలిపారు. స్థానిక సీక్వెల్ రిసార్ట్స్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ బుక్ ఫెయిర్‌ను మేయర్ నీరజ ప్రారంభించనున్నారని తెలిపారు. గొరిల్లా పార్కు సమీపంలోని కేఎల్సీ సీక్వెల్ రిసార్ట్స్‌లో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ బుక్‌ఫెయిర్ కొనసాగుతుందన్నారు. పుస్తక ప్రచురణలో 72 ఏళ్ల అనుభవం కలిగిన సెంట్రల్ బుక్స్ ఎందరో విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చిందన్నారు. విద్యావేత్తలతో సెంట్రల్ బుక్స్ చక్కని పుస్తకాలను రూపొందిస్తుందన్నారు. రీడింగ్ స్కిల్స్, విజ్ఞాన, వినోదాలను కలిగించడమే ధ్యేయంగా 'సెంట్రల్ బుక్స్' పుస్తకాల రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. బుక్ఫెయిర్లో ప్రాపంచిక జ్ఞానాన్ని పెంపొందించే సకల పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు. మూడురోజుల పాటు కొనసాగే ఈ బుక్‌ఫెయిర్‌ను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.