Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వతెలంగాణ-ఖమ్మం
ప్రయివేటు టీచర్స్‌కు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థికసాయాన్ని కొనసాగించాలని డీఈఓ యాదయ్యకు గురువారం డీవైఎఫ్ఐ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ రాష్ట్రంలో 3లక్షల మందికి పైగా ప్రయివేటు టీచర్స్ ఉన్నారని, ఖమ్మం జిల్లాలో 12వేల మంది ఉన్నారని, కరోనా వల్ల పాఠశాలలు నడవక, ఉద్యోగాలు పోవటంతో ఏ పని చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చాలా మంది కూలి పనికి వెళ్లి జీవనం కొనసాగిస్తున్నారని, అలా చేయలేని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్లాంటి సందర్భంగా అనేక పోరాటాలు, వినతులు ఇవ్వటం ద్వారా కంటి తూడుపు చర్యలాగా ఆర్థిక సహాయాన్ని ప్రకటించి ముచ్చటగా మూడు నెలలు మురిపించి దానిని ఆపేయడం అన్యాయం అన్నారు. వెంటనే ఆ సాయాన్ని పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రయివేటు టీచర్లతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు గుమ్మా ముత్తారావు, శీలం వీరబాబు, రావుల పాటి నాగరాజు, అశోక్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.