Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ చేస్తున్న దీక్షలకు సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు
నవతెలంగాణ-కొత్తగూడెం
ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న పోరాటం అభినందనీయమని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. ధర్నా చౌక్ వద్ద గత రెండు రోజులగా దీక్షలు చేస్తున్న కాంగ్రెస్ నేతలను గురువారం సీపీఐ(ఎం) బృందం కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడారు. రైల్వేస్టేషన్ సమీపంలో ఎన్నో ఎండ్లుగా ఉన్న పేద ప్రజల ఇండ్లు కూల్చి వేయడంలో స్థానిక ప్రజా ప్రతినిధి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. వారికి న్యాయం జరగాలంటే అఖిల పక్షం అద్వర్యంలో పోరాటం చేయాలిని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి భూక్యా రమేష్, జిల్లా కమిటీ సభ్యులు లిక్కి బాలరాజు, సందకూరి లక్ష్మీ, డి.వీరన్న, మహమ్మద్ జాలాల్ తదితరులు పాల్గొన్నారు.