Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన 72 గంటల కాంగ్రెస్ రిలే దీక్ష
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం మేదరబస్తీలోని పేదలు నివాసాలు కోల్పోయి నిరాశ్రయులుగా మారారని వారికి న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాట సాగిస్తుందని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. గత రెండు రోజులగా నిర్వహించిన 72 గంటల నిరే నిరాహర దీక్ష గురువారం ముగిశాయి. ఈ సదర్భంగా నాయకులు మాట్లాడారు. గత 50 ఎండ్లుగా నివాసంలో ఉన్న వారి ఇండ్లను కూల్చి వేయడం దుర్మార్గమన్నారు. వారికి న్యాయం చేస్తానని బూటకపు మాటలు చెప్పి హైదరాబాదులో తిరుగుతున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వెంటనే నిర్వాసితుల పక్షాన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎమ్మెల్యే ఇంటి ముందు నిర్వాసితులు బైఠాయిస్తారని హెచ్చరిం చారు. రెండవ రోజు జిల్లా అధ్యక్షులు ఎర్రా.కామేష్ దీక్షలో కూర్చున్న వారికి దండలువేసి దీక్షలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ 29 వార్డు కౌన్సిలర్ తంగెళ్ల లక్ష్మణ్, యువజన కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీ షేక్ అబీద్, కృష్ణమూర్తి, రామయ్య, బాబు, కృష్ణయ్య, శ్రీను, అరుణ్, అభిషేక్ ఉన్నారు.
సంఘీభావం : కాంగ్రెస్ ఆద్వర్యంలో చేపట్టిన 72 గంటల రిలే దీక్షలకు పలు రాజకీయ, ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపాయి. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, నాయకులు భూక్యా రమేష్, లిక్కి బాలరాజు, సందకూరి లక్ష్మీ, డి.వీరన్న, మహమ్మద్ జాలాల్, బృందం, ఆదివాసీ జేఏసి కన్వీనర్ వాసం రామకృష్ణ దొర, వీరితో పాటు జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగా సీతారాములు, జెబి.శౌరి, ధర్మారావు, రాందాస్ నాయక్, చంద్రుగొండ జడ్పీటీసీ వెంకటరెడ్డి, గరిపేట ఎంపీటీసీ భద్రం, మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి కరీం పాషా తదితరులు పాల్గొన్నారు.