Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వాపురం
మండల పరిధిలోని మల్లెలమడుగు గ్రామానికి చెందిన లింగాల అప్పారావు రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నాడన్న సమాచారం మేరకు గురువారం మణుగూరు సివిల్ సప్లై డిప్యూటి తహశీల్దార్ ముత్తయ్య సదరు వ్యక్తి ఇంటి వద్ద 5 క్వింటాళ్ళ బియ్యాన్ని పట్టుకున్నారు. వ్యాపారిపై 6 ఎ ప్రకారం కేసు నమోదు చేసి బియ్యాన్ని స్వాధీన పరుచుకున్నట్లు ఆయన తెలిపారు.
సారపాక : అక్రమంగా నిలువ ఉంచిన రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు గురువారం సీజ్ చేశారు. సివిల్ సప్లై కాస్తల వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. బూర్గంపాడు మండలం పరిధిలోని సారపాక గ్రామంలో పాలకుర్తి జయరాజు అనే వ్యక్తి ఇంట్లో ఏడు క్వింటాళ్ళ రేషన్‌బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచాడన్నారు. పక్క సమాచారంతో దాడులు నిర్వహించగా అక్రమంగా నిల్వవుంచిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేశామన్నారు. అతని పై 6ఏ కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.