Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లబ్దిదారులు లిస్ట్ తేల్చాలి, ప్రతి ఇంటికీ సర్వే నిర్వహించాలి
- సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి దొడ్డా రవికుమార్
నవతెలంగాణ-పాల్వంచ
పాల్వంచలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం నాశిరకంగా ఉందని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు, పట్టణ కార్యదర్శి దొడ్డ రవికుమార్ అన్నారు. స్థానిక పాల్వంచ పట్టణ పరిధిలోని నవభారత్ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ పక్కన తెలంగాణ ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లను వారు పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం సందర్శించి, మాట్లాడారు. సీపీఐ(ఎం) పోరాట ఫలితంగా ఇప్పుడు నిర్మాణం చేపట్టే భూమి కొద్దిమంది కబ్జాదారుల చేతుల్లో ఉంటే ప్రజలను సమీకరించి, గుడిసెల వేసిన సందర్భంగా ఆనాడు తహసీల్దార్‌గా ఉన్న గన్యా నాయక్ ఇక్కడ ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. సుమారు మూడేండ్లు అవుతున్న ఆ హామీని నెరవేర్చలేదన్నారు. మరోవైపు నాసిర కంగా నిర్మాణం చేస్తున్నారని సరైన రీతిలో కట్టకుండా వర్షం వస్తే నీళ్లు వచ్చే పరిస్థితి ఉందని ఇప్పటికైనా అధికారులు సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడి సరైన పద్ధతిలో నిర్మాణం చేపట్టాల న్నారు. అనంతరం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు ఎం.జ్యోతి మాట్లాడుతూ పేదవాడి సొంత ఇంటి కల కలగానే మిగిలిపోయిందన్నారు. ఈ సందర్శన కార్యక్రమంలో పార్టీ పట్టణ కమిటీ గూడెపురి రాజు, మెరుగు ముత్తయ్య, కే.సత్య, వి.సత్యవాణి, రహీం, పార్టీ శాఖ కార్యదర్శి రాములు, తులసిరామ్ సీనియర్ సభ్యులు సోమలింగం పాల్గొన్నారు.