Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత పథకాలను జీపీ కార్మికులకు వర్తింపజేయాలి
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్
నవతెలంగాణ-భద్రాచలం
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, దళిత పథకాలను వర్తింపచే యాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే.రమేష్ అన్నారు. గురువారం భద్రాచలం జీపీ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏజే రమేష్ హాజరై మాట్లాడారు. 2021 పీఆర్సి వేతనాల పెంపు ప్రకారం గ్రామపంచాయతీ కార్మికుల కూడా 30 శాతం వేతనాలు పెంచాలని ఆయన అన్నారు. కనీస వేతనం రూ.18000 ఇవ్వాలని, అర్హులైన అందరినీ పర్మినెంట్ చేయాలని అన్నారు. ఈ నెల 6వ తేదీన జరిగేటటువంటి జిల్లా కార్యాలయాలు ధర్నాలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఆగస్టు 20వ తేదీన జరిగే హుజూరాబాద్ శంఖారావం సభను జయప్రదం చేయాలని కోరారు. భద్రాచలం పంచాయతీ గ్రామ పంచాయతీనా? లేక మున్సిపాలిటీల అనేది వెంటనే తేల్చాలని ఆయన అన్నారు. ప్రతి నెల 5వ తేదీ లోపు వేతనాలు చెల్లించాలని, ఆదివారం పండుగ సెలవు లు ఇవ్వాలని, మృతి చెందిన కార్మికులకు ఇన్సూరెన్స్ రూ.20 లక్షల ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని లేనిపక్షంలో రాష్ట్రంలోని జిల్లా కార్యాలయాలు అన్నీ కూడా దిగ్బం ధిస్తామని ఆయన తెలిపారు. అదేవిధంగా సీఐటీ యూ జిల్లా కమిటీ సభ్యులు ఎం.బీ. నర్సారెడ్డి మా ట్లాడారు. ఈ కార్యక్రమం గ్రామపంచాయతీ యూని యన్ అధ్యక్షులు కాపుల రవికుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో సీఐటీయూ బాధ్యులు బండారు రామకృష్ణ, కృష్ణార్జున రావు, నాగేశ్వరరావు, ప్రేమ్, ఆదినారాయణ, కత్తి శ్రీను, విజయ, భాగ్యమ్మ రెడ్డి శ్రీనివాస్ అనేక మంది కార్మికులు పాల్గొన్నారు .