Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధికి నిధులు ఇవ్వాలిన కోరిన ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-అశ్వారావుపేట
మండలంలో అభివృద్ధికి సహాకరించాలని, అందకనుగుణంగా నిధులు మంజూరు చేయాలని పంచాయతీరాజ్ శాఖామాత్యులు యర్రబెల్లి దయాకర్ రావును మండల ప్రజాప్రతినిధులు కోరారు. పామ్ ఆయిల్ సాగు విస్తరణ క్రమంలో ఈ ప్రాంతంలోని పామాయిల్ క్షేత్రాలను పరిశీలిం చడంతో పాటు పామ్ ఆయిల్ పంట స్థితిగతుల అవగాహన కోసం వరంగల్ ప్రాంతం రైతులతో పాటు ఆయన గురువారం మండల పరిధిలోని నారం వారి గూడెం పరిధిలోగల ఆయిల్ ఫెడ్ కేంద్రీయ నర్సరీని సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావులకు స్థానిక కెమిలాయిడ్స్ అతిధి గృహంలో మధ్యాహ్నం భోజనం వసతి ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న ఆయనను ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, జడ్పీటీసీ వరలక్ష్మి, సర్పంచ్ అట్టం రమ్యలు మర్యాదపూ ర్వకంగా కలిసి, శాలువాతా సత్కరించి జ్ఞాపికను అందజేసారు. అనంతరం నూతనంగా ఏర్పడిన 14 పంచాయతీలకు కార్యాలయ భవనాలు నిర్మించాలని, శిధిలావస్తకు చేరిన మూడు పంచాయతీల భవనాలకు మరమ్మతులు చేయించాలని, మండలం లోని పలు పంచాయతీలను అనుసంధానం చేయడా నికి అంతర్గత రహదారులు నిర్మించాలని వినతి పత్రం అందజేసారు. వీరివెంట తెరాస మండల అద్యక్షకార్యదర్శులు బండి పుల్లారావు, శ్రీను ఉన్నారు.