Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మధిర
మధిర మండలంలోని మాటూరు ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నందు వివిధ కేటగిరీలలో నమోదయ్యారని తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ నిర్వాహకులు శ్రీ చింతలపాటి వెంకటాచారి ఒక ప్రకటనలో తెలిపారు. మ్యాథమెటికల్ 28 టేబుల్స్ రివర్స్ రైటింగ్ విభాగంలో మేడిశెట్టి నందిని, వివిధ భాషల అక్షరమాల అనే విభాగంలో చీళ్ల త్రివేణి, వివిధ భాషల జాతీయగీతం అనే విభాగంలో తోట ప్రతీష, ఇండియా మ్యాప్ లో 29 రాష్ట్రాలను డ్రాచేసి రాష్ట్రాల పేర్లను గుర్తించే విభాగంలో మేడిశెట్టి వెంకట లక్ష్మి లహరిఅనే నలుగురు మాటూరు హైస్కూల్ కు చెందిన విద్యార్థినులు ఒకేసారి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడం అత్యంత అద్భుతమైన ఘనతగా పేర్కొంటూ వీరిని తీర్చి దిద్దిన మహ్మద్ చాంద్ బేగం సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సంక్రాంతి శ్రీనివాసరావు, కొలగాని ప్రసాదరావు, మేడేపల్లి శ్రీనివాసరావు, కంచిపోగు ఆదాము, రెంటపల్లి భాగ్య శ్రీనివాసరావు, వేము రాములు, గుంటుపల్లి రమాదేవి, వేములపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.