Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-విలేకర్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని మండలాల్లో తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. జయశంకర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళ్లు అర్పించారు. భద్రాచలంలోని టీఎన్జీవోస్ ప్రెసిడెంట్ డెక్క నరసింహారావు, అసోసియేట్ ప్రెసిడెంట్ కటుకూరి నాగభూషణంల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఈఓ బి.శివాజీ నివాళ్లు అర్పించారు. పోలీస్ కార్యాలయాల్లో ఎస్సై మధుప్రసాద్, ట్రాఫిక్ యస్.ఐ. శ్రీపతి తిరపతి నివాళులు అర్పించారు. గుండాలలో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రంగు రమేష్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో పీఏసీఎస్ చైర్మన్ గొగ్గెల రామయ్య, నివాళ్లు అర్పించారు. చండ్రుగొండలో ఎంపీపీ భానోత్ పార్వతి జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అశ్వాపురంలో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ముత్తినేని సుజాత ఆయన చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులర్పించారు. అదేవిధంగా నెల్లిపాక సొసైటీ కార్యాలయంలో అధ్యక్షుడు తుక్కాని మధుసూదన్‌రెడ్డి, మొండికుంట, చింతిర్యాల కాలనీ పంచాయతీ కార్యాలయాలలో సర్పంచ్‌లు మర్రి మలారెడ్డి, పాయం భద్రయ్య నివాళ్లు అర్పించారు. ఇల్లందులో ఎమ్మెల్యే క్యాంపు, జీఎం, ఎండీఓ, తహసీల్దార్, పంచాయతీ కార్యాలయాల్లో నివాళులర్పించారు. మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు నివాళ్లు అర్పించారు. మణుగూరులో సింగరేణి పాఠశాల కరస్పాండెంట్ రాజేశ్వరరావు నివాళుర్పించారు. అనంతరం పాఠశాల హెచ్ఎం ఈజి స్వరూపారాణి మాట్లాడారు. పినపాకలో ఎంపీడీవో కార్యాలయంలో, సహకార సంఘం, పోలీస్ స్టేషన్, పంచాయతీ కార్యాలయంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఎంపీడీవో శ్రీనివాసులు, తాసిల్దార్ విక్రమ్ కుమార్ ఆర్, సర్పంచులు, సెక్రటరీలు, వివిధ శాఖల అధికారులు నివాళ్లు అర్పించారు. అదేవిధంగా పాల్వంచలో
డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు మంతపురి రాజూగౌడ్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేంద్ర కమిటీ సభ్యుడు చాట్ల శ్రీనివాసరావు నివాళ్లు అర్పించారు.
కరకగూడెంలో ఎంపీపీ రేగా కాళికా నివాళ్లు అర్పించారు. అశ్వారావుపేటలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉన్న జయశంకర్ విగ్రాహానికి సీఐ ఉపేందర్ రావు, ఎస్.ఐ అరుణ, ముబారక్ బాబా, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శ్రీరామమూర్తి, జడ్పీటీసీ వరలక్ష్మి, ఎండీఓ విద్యాధర రావు, గ్రామ పంచాయతీలో జయశంకర్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. బూర్గంపాడులో ఎమ్మెల్యే రేగా కాంతారావు మండల పర్యటనలో భాగంగా బూర్గంపాడులో జయశంకర్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, మాట్లాడారు. దమ్మపేటలో హై స్కూల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు నివాళ్లు అర్పించారు. అన్నపురెడ్డి పల్లిలో అధికారులు, ప్రజా ప్రతినిధిలు నివాళ్లు అర్పించారు.
ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ కొట్టే సంధ్యారాణి నివాళ్లు అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని, మాట్లాడారు.