Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'సెంట్రల్ బుక్' ఫెయిర్ ప్రారంభోత్సవంలో కలెక్టర్ వీపీ గౌతమ్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పుస్తక పఠనంతో విజ్ఞానం పెంపొందుతుందని, ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవడం అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. నగరంలోని సీక్వెల్ రీసార్ట్స్ లో శుక్రవారం సెంట్రల్ బుక్ షాపు ఆఫ్ హైదరాబాదు వారు ఏర్పాటు చేసిన ''బుక్ ఫెయిర్''ను కలెక్టర్ ప్రారంభించారు. నగరంలో ఏర్పాటు చేసిన బుక్ ఫెయిర్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తల్లిదండ్రులు, యువత, చిన్నారులు సహా ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవడం అలవర్చుకోవాలన్నారు. చిన్నపిల్లలు మొదలుకొని 18 సంవత్సరాలలోపు పిల్లలకు ఉపయోగపడే వివిధ పుస్తకాలు, స్టేషనరీని బుక్ ఫెయిర్‌లో అందుబాటులో ఉంచామని సెంట్రల్ బుక్ షాప్ ఆఫ్ హైదరాబాదు నిర్వాహకులు సిద్దార్థ్ తెలిపారు. మూడురోజుల పాటు బుక్ ఫెయిర్ నగర ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఫాతీమా జోహరా, కార్పొరేటర్ పగడాల నాగరాజు, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, నిర్వాహకులు, జాన్సన్ కిడ్స్ స్కూల్ చైర్మన్ మమత తదితరులు పాల్గొన్నారు.