Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ముదిగొండ
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రాభివృద్ధిని శూన్యం చేశారని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు విమర్శించారు. మండల పరిధిలో వెంకటాపురం సిపిఎం గ్రామశాఖ మహాసభ అమరవీరుడు(బంక రాములు ప్రాంగణం)లో పార్టీ గ్రామకార్యదర్శి బంక ముక్కంటి అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఖజానా లూటీ చేస్తూ ప్రభుత్వ భూములను ప్రైవేటుపరం చేసేందుకు కేసీఆర్ కుయుక్తులు పన్నుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో ఎర్రజెండాదే రాజ్యమని, ప్రజలు కమ్యూనిస్టుల వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలను వెలికితీసి సమస్యలపై పోరాటాలకు ప్రజలను సిద్ధం చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బండి రమేష్ మాట్లాడుతూ మహాసభల స్ఫూర్తితో నాయకులు, కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలన్నారు. తొలిత మహాసభల ప్రాంగణంలో పార్టీ జెండాను సీనియర్ నాయకులు నెమలి సైదులు ఎగరవేశారు. అనంతరం సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శిగా కటారీ హుస్సేన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సభలో రైతు సంఘం జిల్లా నాయకులు రాయల వెంకటేశ్వర్లు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బండి పద్మ, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బండారు రమేష్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్కే బషీరుద్దీన్, సిపిఎం మండల కార్యదర్శి వాసిరెడ్డి వరప్రసాద్, పార్టీ మండల నాయకులు బట్టు పురుషోత్తం, మంకెన దామోదర్, మందరపు వెంకన్న, టీఎస్ కళ్యాణ్, వేల్పుల భద్రయ్య, ఎంపీటీసీ సభ్యురాలు కోలేటి అరుణ, ఐద్వా మండల అధ్యక్ష కార్యదర్శి మందరపు పద్మ, పయ్యావుల ప్రభావతి, ఐద్వా మండల ఉపాధ్యక్షులు కె రోజా, సొసైటీ డైరెక్టర్ రాయల శ్రీనివాసరావు,పార్టీ గ్రామనాయకులు రమేష్, శ్రీను దర్గయ్య, సర్వయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.