Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
గ్రీన్ భధ్రాద్రి అధ్యక్షులు భోగాల శ్రీనివాస రెడ్డి వారి తనయుడు డాక్టర్ భోగాల భూపతిరెడ్డి జన్మదిన సందర్భంగా బీసీఆర్ ట్రస్ట్‌కు రూ.5 వేల విలువైన బియ్యం, కోడిగుడ్లు, జీడిపప్పు బాదం పప్పులను శుక్రవారం అందజేశారు. భద్రాచలంలోని బీసీఆర్ ట్రస్ట్‌ని, సందర్శించిన గ్రీన్ భద్రాద్రి సభ్యులు కరోనా థర్డ్ వేవ్ ప్రబలుతున్న నేపథ్యంలో బీసీఆర్ ట్రస్టు అందిస్తున్న సేవలు అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా భోగాల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బీసీఆర్ ట్రస్టు అందిస్తున్న సేవలు అందరికీ మార్గదర్శకమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు బోగాల శ్రీనివాసరెడ్డి, సీపీఐ(ఎం) నాయకులు యంబీ.నర్సారెడ్డి, యం.రేణుక, భీమవరపు వెంకట రెడ్డి, గడ్డం స్వామి, బండారు శరత్ బాబు, అరుణ, గ్రీన్ భద్రాద్రి ప్రధాన కార్యదర్శి తిరుమలరావు, తదితరులు పాల్గొన్నారు.