Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-పాల్వంచ రూరల్
సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిం చాలని కలెక్టర్ అనుదీప్ వైద్య అధికారులకు ప్రజాప్ర తినిధులకు సూచించారు. శుక్రవారం పాల్వంచ మండల పరిధిలోని ఉల్వనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. వైద్యశాలలో వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరిశీలించి, వారికి అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు.
గ్రామంలో పాదయాత్ర చేసిన కలెక్టర్
ఉల్వనూరు గ్రామంలో కలెక్టర్ ప్రతి వీధిలో పాదయాత్ర చేసి ప్రజలతో మాట్లాడుతూ రోడ్ల వెంబడి నీటిని నిలువ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ఆరోగ్య కేంద్రం పరిధిలో 16 మలేరియా కేసులు నమోదయ్యాయని పరిశుభ్రంగా పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మలేరియా డెంగ్యూ లాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చని అన్నారు.
పల్లె ప్రకృతి వనరులను సందర్శించిన కలెక్టర్
మందెర కల పాడు ఉల్వనూరు గ్రామపంచా యతీలో ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనాలు ఎడారిలా ఉండొద్దని మంచి ఆహ్లాదకర వాతావరణం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి సర్పంచులకు సూచించారు. అనంతరం నరసింహ సాగర్ గ్రామంలోని ప్రజలతో ముఖాము ఖి మాట్లాడారు.
అనంతరం అంగన్వాడి కేంద్రం టీచర్ నియామకంలో ఇటీవల వచ్చిన ఆరోపణలపై తనకు నివేదిక అందించాలని తహసిల్దార్ స్వామిని ఆదేశించారు. అనంతరం ప్రజలు చంద్రలగూడెం నుండి కిన్నెరసాని వరకు రోడ్డు నిర్మించాలని కలెక్టర్ కు ప్రజలు విన్నవించారు. దీంతో కలెక్టర్ మాట్లాడు తూ వివిధ శాఖల ద్వారా ప్రతిపాదనలు తయారు చేపించి, రోడ్డు నిర్మాణానికి తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవీంద్ర ప్రసాద్, తహసీల్దార్ స్వామి, ఎంపీవో రామకృష్ణ, జడ్పీటీసీ వాసు దేవరావు, సర్పంచులు,కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.