Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే పొదెం వీరయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
సీఎం కేసీఆర్ పాలన అస్తవ్యస్తంగా మారిందని, పాత పతకాలు అమలు చేయడం చేతగాని ముఖ్యమంత్రి ఎన్నికలప్పుడు కొత్త పథకాలు సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నాడని, కొత్తగూడెంలో ఇండ్లు కోల్పోయి, నీడలేక నిరాశ్రయులుగా ఉన్న వారికి అండగా ఉంటానన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు జాడ ఎక్కడా...అని, పాల్వంచలో సంచలనం రేపిన ఆత్మహత్య కేసు సూసైడ్ నోట్లో ప్రధానంగా ఉన్న ఎమ్మెల్యే వనమా కొడుకు రాఘవేంద్రను వెంటనే అరెస్టు చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య డిమాండ్ శుక్రవారం కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఛలో ఇంద్రవెల్లి ఆత్మగౌరవ దందోరా యాత్రను చేపట్టడం జరిగిందని, దీనిని జయప్రదం చేయాలని పొదెం వీరయ్య పిలుపు నిచ్చారు. యాత్ర ఈ నెల 9 నుండి సెప్టెంబర్ 17 వరకు ఉంటుందన్నారు. ఈ విలేకర్ల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ, మోత్కూరి ధర్మారావు, లక్కినేని సురేందర్, ములకలపల్లి జడ్పీటీసీ నాగమణి, మున్సిపల్ కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ లక్ష్మణ్, నాయకులు ఏనుగుల అర్జున్‌రావు, వీరబాబు పాల్గొన్నారు.