Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కార్యదర్శి కనకయ్య నివాళి
నవతెలంగాణ-అశ్వారావుపేట
అశ్వారావుపేటలో సీపీఐ(ఎం) నిర్మాణం ప్రముఖుల్లో ఒకరైన పేరాయిగూడెం (నెహ్రూ నగర్)కు చెందిన నార్లపాటి సత్యం (83) శుక్రవారం తెల్లవారు జామున అనారోగ్యంతో తన స్వగృహంలో మృతి చెందారు. ఆయన గత కొంత కాలంగా వయోభారంతో తలెత్తిన అనారోగ్యం సమస్యలతో చికిత్సపొందుతున్నారు. సత్యంకు భార్య నాగరత్నం, కూతురు, కుమారుడు జగన్నాధం ఉన్నారు. జగన్నాదం పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా కార్యదర్శి అన్నవరం కనకయ్య అశ్వారావుపేట చేరుకుని సత్యం మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పిం చారు. అంతకు ముందు జిల్లా కార్యదర్శి వర్గం సభ్యు లు కొక్కెరపాటి పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు పిట్ట ల అర్జున్, చిరంజీవిలు సత్యం మృత దేహంపై పార్టీ పతాకాన్ని కప్పి శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముందు తరం కమ్యూని స్టులను కోల్పోవడం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేసారు. సత్యం కుటుంబానికి జిల్లా కమిటీ తరుపున ప్రగాఢ సంతాపం తెలిపారు. సత్యం భౌతిక కాయానికి సీనియర్ నాయకులు ఎస్.కె. అబ్దుల్ రహామాన్ బాబా, మండల కమిటీ సభ్యులు ముళ్ళగిరి గంగరాజు, మడిపల్లి వెంకటేశ్వర రావు, హామాళీ కార్మికులు నివాళులు అర్పించారు.