Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుండాల:గత రెండు సంవత్సరాల క్రితం ముత్యం రమేష్ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. నాటినుండి ప్రజలతో మమేకమై పనిచేస్తూ అందరితో మంచి స్నేహభావంతో వ్యవహరించారు. మండల ంలో అనేక కార్యక్రమాలను చేపట్టి సత్ఫలితాలను సాధించారు. సీఐగా పదోన్నతి పొంది బదిలీపై జిల్లా కేంద్రానికి వెళ్లారు. కాగా ఇప్పటి వరకు ఇక్కడ ట్రైనీ ఎస్ఐ పని చేసిన ఇరుగు జీవన్ రాజు ఇన్చార్జి ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. పదోన్నతిపై వెళ్తున్న ముత్యం రమేష్‌ను పోలీసు సిబ్బందితో పాటు పాత్రికేయులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాత్రికేయులు టి.నాగరాజు, ఎండి. యాకుబ్, కె.పాపాచారి, వై.యాకయ్య, గడ్డం.వీరన్న, ఆర్.సంతోష్, వై.తిరుపతి, బి.వినరు, తదితరులుపాల్గొన్నారు.