Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డున పడ్డ పీపీఆర్ కంపెనీ కార్మికులు
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు సింగరేణి ఉపరితల గని ఓబి నందు వీపీఆర్ కంపెనీకి ఆరు సంవత్సరాలు పనిచేయడానికి కాంట్రాక్ట్ కుదిరింది. కానీ గత రెండు సంవత్సరాల నుండి సింగరేణి యాజమాన్యం అనుమతులు ఇవ్వకుండా బ్లాస్టింగ్ నిర్వహించి పనులు చేయించుకున్నదన్నారు. అనుమతులు లేని కారణంగా జూలై 28న లీగల్ నోటిసులు సంస్థకు అందజేసి పనులు నిల్పివేశామని విపిఆర్ కంపెని యాజమాన్యం తెలిపింది. శుక్రవారం విపిఆర్ యాజమాన్యం విలేకరులతో మాట్లాడుతూ.. 2019 మే 16 నుండి మణుగూరు ఓసిలో విపిఆర్ కంపెని ఓబి పనులు నిర్వహిస్తున్నదని, అప్పటి నుండి కంపెని ఏలాంటి అనుమతులు తీసుకోకుండా తమతో బలవంతంగా బ్లాస్టింగ్ పనులు నిర్వహిస్తుందన్నారు. ఈనెల 5వ తేదిన సింగరేణి ప్రధాన కార్యాలయం కొత్తగూడెంలో డైరెక్టర్ ఆపరేషన్ ఎస్.చంద్రశేఖర్, పైనాన్స్ డైరెక్టర్ అండ్ పిపి(పా) ఎన్.బాలరామ్, ఈఅండ్ఎం సత్యనారాయణరావు, సీజిఎం సెప్టి వెంకటేశ్వరరెడ్డి, జీఎం సిఎంసి రాంచందర్, మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేష్తో విపిఆర్ యాజమాన్యం చర్చల జరిపిందన్నారు. ఈ చర్చలో కాంట్రాక్ట్ బిడ్డింగ్ వేసేటుప్పుడు లేనటువంటి షరతులు ఇప్పుడు విధించారని వారు వాపోయ్యారు. గోదావరి కరకట్ట నుండి వంద మీటర్ల నుండి 250 మీటర్ల వరకు 60కెజీల ఎక్స్ప్లోజీల్స్ ఉపయోగించాల్సి వుండగా 25 కెజిల ఎక్స్ ప్లోజిల్స్ మాత్రమే అనుమతి ఇచ్చారన్నారు. కానీ టెండర్లలో ఈ విధానం లేని కారణంగా యాజమాన్యం సింగరేణి సంస్థకు లీగల్ నోటిసు అందజేసి పనులను నిల్పివేశామన్నారు. దీని కారణంగా వంద మంది నాన్ లోకల్ కార్మిక కుటుంబాల కు సౌకర్యాలు మరియు ఈఎంఐ నెలకు 8కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుందన్నారు. దీనిపై ఆధారపడి జీవించే కార్మికులు 500 మంది ఉపాధి కోల్పోతున్నారని విపిఆర్ యాజమన్యం తెలిపింది. ఈ ప్రాంత నిర్వాసిత నిరుద్యోగులను రోడ్డున పడకుండా చూడాలని యాజమన్యం కోరారు.