Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవలు వినియోగదారులకు మరింత చేరువ అయ్యాయి. జంటనగరాలల్లో ప్రారంభమైన హెం డెలివరీ సేవల్ని మరిన్ని జిల్లాల్లో విస్తృతం చేస్తోంది. ఆయా జిల్లాల్లో హెం డెలివరీ ద్వారా ఇంటింటికీ లేదా షాపులకు పార్శిల్ అందిం చేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు బస్టాండు నుంచి బస్టాండు వరకే పార్శిళుచేరవేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందు బాటులోకి వచ్చిన ఈ సేవల ద్వారా పార్శిల్స్ ఇళ్లు, షాపులు కార్యాలయాలకు తీసుకెళ్లేందుకు పడుతున్న ఇబ్బందులు ఇక తీరనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ప్రారంభమైన హెం డెలివరీ సేవలు నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలోనూ తాజాగా అందుబాటులోకి వచ్చాయి. వినియోగ దారులు బుకింగ్ చేసుకునే సమయంలో హెం డెలివరీ సేవల్ని కోరినట్ల యితే ఆ మేరకు బస్టాండ్ల నుంచి నేరుగా పార్శిల్స్ ను ఇంటి వద్దనే అందజేస్తారు. ఈ మేరకు ఆయా ఏజెన్సీలతో టి.ఎస్ ఆర్టీసీ కార్గో ఒప్పందం కుదుర్చుకుంది. హౌం డెలివరీ చేస్తే వినియోగదారులు అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. త్వరలో బెంగళూరులోని 10 ముఖ్య పాయింట్లలో హెం డెలివరీ సేవలతో పాటు పికప్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి వ్యాపార కేంద్రాలు విజయవాడ, విశాఖపట్నంలకు నేరుగా హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్ట్ మీదుగా కార్గో సర్వీసులను నడుపుతోంది. విశాఖకు నిత్యం ఈ సర్వీసు డెలివరీ చేయడంతో పాటు ఆయా ప్రాంతాల నుంచి లోడ్ పికప్ చేస్తూ రాకపోకలు సాగిస్తోంది.
వినియోగదారులకు మరింత చేరువ కావాలనే డోర్ డెలివరీ సేవలు
- పువ్వాడ అజరు కుమార్, రవాణా శాఖ మంత్రి
సంస్థలోని మానవ వనరులను ఉపయోగిస్తూ టి.ఎస్ ఆర్టీసీ కార్గో ఉత్తమ సేవలు అందిస్తోంది. వినియోగదారులకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో టి.ఎస్ ఆర్టీసీ డోర్ టు డోర్ డెలివరీ సేవల్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో వినియోగదారుల డిమాండును దృష్టిలో పెట్టుకుని కార్గో, పార్శిల్ సేవల్ని విస్తృతం చేస్తున్నాం. బుక్ చేసిన పార్శిల్స్ ఆయా బస్టాండులకు చేరుకున్న తరువాత కూడా వినియోగదారులు హెరీం డెలివరీ కావాలని కోరితే పంపుతున్నాం. ఫోన్ చేసి చెప్పినా ఆ పార్శిల్స్ ను నేరుగా ఇంటి వద్ద ఇస్తున్నాం. ఈ సేవల ద్వారా వినియోగదారులకు సమయం, రాకపోకల ఖర్చు తగ్గుతుంది. గత జులై మాసంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా విశాఖ పట్టణంకు ప్రారంభమైన కార్లో సర్వీసుకు క్రమంగా ఆదరణ లభిస్తోంది. పార్శిల్ సేవలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 36.95 లక్షల పార్శిల్స్ చేరవేయడం ద్వారా రూ.52.31 కోట్లు సంస్థ ఆర్జించింది. చిన్న లోటుపాట్లు మినహా ఎప్పుడూ, ఎక్కడా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా సేవలు అందిస్తున్నాం. సిబ్బంది, అధికారుల కృషి ఫలితంగానే ఇది సాధ్యమవుతుంది.