Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సంఘాల ఐక్య వేదిక పిలుపు
నవతెలంగాణ-కొత్తగూడెం
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 9న భారత రక్షణ దినంగా పాటిద్దామని ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు పిలుపు నిచ్చారు. శుక్రవారం స్థానిక మంచి కంటి భవన్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. భారత దేశానికి స్వతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న నేటికి నిరుద్యోగం, అసమానతలు, పేదరికం, పౌస్టికహార లోపం ఆకలి చావులు వంటి దేశాన్ని చుట్టుముట్టి సంక్షోభానికి నెట్టివేశాయన్నారు. అగస్టు 9న భారత రక్షణ దినాని పాట్టిదామని అఖిలపక్ష ప్రజా సంఘాల ఐక్య వేదిక పిలుపు నిచ్చారు. 4 లేబర్ కోడ్లు. గ్రామీణ ప్రాంతాల నుండి వలసలను నిరోధించి, కనీసం 100 రోజులైనా ఉపాధికి గ్యారంటీనిచ్చే ఉపాధి హామీ చట్టంలో వేతనాల చెల్లింపులో కూలాల విభజనలు తెచ్చేందుకు కుట్ర పన్నుతుందన్నారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యంవి అప్పారావు, ఎజే రమేష్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కున్సోత్ ధర్మ, సహాయ కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జాటోత్ కృష్ణ, రైతు, సీఐటీయూ, నాయకులు యు.నాగేశ్వరరావు, జి.పద్మ, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి గుత్తుల సత్యనారాయణ, రాంచందర్, ఐఎఫ్టీయూ నాయకులు డి.ప్రసాద్, సంజీవ్, సతీష్, రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు బాణోత్ ఊక్ల, తదితరులు పాల్గొన్నారు.